నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ఫలితం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలకు చెందిన సొంత పార్టీ ఓటర్లే ఆయా పార్టీలకు షాక్ ఇచ్చారు. టీఆరెస్ కు ఉన్న ఓట్లు 505 కాగా, ఆపార్టీకి పోలయిన మొత్తం ఓట్లు ఏకంగా 728 ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, బీజేపీల నుండి ఎన్నికల ముందు దాదాపు వందమంది గులాబి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ఓట్లలో దాదాపు 100 మందికి […]

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్
Follow us

|

Updated on: Oct 12, 2020 | 11:36 AM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ఫలితం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలకు చెందిన సొంత పార్టీ ఓటర్లే ఆయా పార్టీలకు షాక్ ఇచ్చారు. టీఆరెస్ కు ఉన్న ఓట్లు 505 కాగా, ఆపార్టీకి పోలయిన మొత్తం ఓట్లు ఏకంగా 728 ఉన్నాయి. అయితే, కాంగ్రెస్, బీజేపీల నుండి ఎన్నికల ముందు దాదాపు వందమంది గులాబి కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన ఓట్లలో దాదాపు 100 మందికి పైగా క్రాస్ ఓటింగ్ చేశారని ఫలితం రుజువుచేస్తోంది. దీంతో డిపాజిట్లు కోల్పోయిన టీకాంగ్రెస్, తెలంగాణ బీజేపీ నేతలు తలలుపట్టుకుంటున్నారు.    బ్రేకింగ్.. కవిత ఘనవిజయం