Breaking News
  • విశాఖ: బ్లూఫ్రాగ్‌ టెక్నాలజీస్‌పై కొనసాగుతున్న సీఐడీ విచారణ. 8 సర్వర్లకు చెందిన డేటాను సేకరించిన అధికారులు. డేటాను విశ్లేషిస్తున్న సీఐడీ అధికారులు. ప్రభుత్వ ఇసుక పోర్టల్‌ను హ్యాక్‌ చేసి.. కృత్రిమ కొరత సృష్టించినట్టు బ్లూఫ్రాగ్‌పై అభియోగాలు.
  • హైదరాబాద్‌: అధికారులతో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ భేటీ. కాచిగూడ రైలు ప్రమాదంపై చర్చ. ప్రకాశం జిల్లా: ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం. కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన జగన్‌.
  • ప.గో: యలమంచిలి మండలం కాజ గ్రామంలో రోడ్డుప్రమాదం. అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు. దంపతులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కల్యాణదుర్గంలో కాలువలోకి దూసుకెళ్లిన కాలేజ్‌ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు. విద్యార్థులకు తృటిలో తప్పిన ముప్పు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
  • భూపాలపల్లిలో కొనసాగుతున్న బంద్‌. ఆర్టీసీ డ్రైవర్‌ నరేష్‌ ఆత్మహత్యకు నిరసనగా బంద్‌. డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.
  • అమరావతి: మంగళగిరి జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవం. పాల్గొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేసిన పవన్‌కల్యాణ్‌.
  • హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్‌. కూకట్‌పల్లిలో ఇండోర్‌ స్టేడియం ప్రారంభం. మల్టీపర్పస్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను.. పిల్లలతో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌. డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన కేటీఆర్. అధికారిక కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై కేటీఆర్‌ వార్నింగ్‌. ఫ్లెక్సీలు తొలగిస్తేనే కార్యక్రమానికి వస్తానన్న కేటీఆర్‌. కేటీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించిన సిబ్బంది.

డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఫైన్.. న్యూయార్క్ కోర్టు ఏం తేల్చిందంటే ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. రెండు మిలియన్ డాలర్లు స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని ఆదేశించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలను విచారించిన న్యూయార్క్ కోర్టు ఈ మేరకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ట్రంప్‌కు దిమ్మతిరిగేలా చేసింది.

ట్రంప్‌ ఫౌండేషన్‌కు వచ్చిన నిధులను 2016 అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకొని డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబీకులు దుర్వినియోగం చేశారనే పిటిషన్‌పై విచారణ తర్వాత ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే కోర్డు ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉన్నా, ఈ అంశాన్ని అటార్నీ జనరల్‌ రాజకీయం చేస్తున్నారని ట్రంప్‌ ఆరోపించారు.

2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ట్రంప్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఫౌండేషన్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లిటిటియా జేమ్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తి సాలియన్‌ స్కార్సుల్లా నిధుల దుర్వినియోగం వాస్తవమని నిర్ధారించారు. ఫౌండేషన్‌ సిబ్ధందిని కూడా తన ఎన్నికల ప్రచారం కోసం కూడా వాడుకున్నారని గుర్తించారు. దీంతో ట్రంప్‌ కుటుంబ సభ్యులు 8 స్వచ్ఛంద సంస్థలకు రెండు మిలియన్‌ డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కాగా అటార్నీ జనరల్‌ జేమ్స్‌ కోర్టు తీర్పును కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్‌. ఫౌండేషన్‌ చేసిన చిన్న సాంకేతిక తప్పిదాల కారణంగా కోర్టుతో ఒప్పందం కుదిరిందని ఆయన అంటున్నారు,. కోర్టు ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థలకు రెండు మిలియర్‌ డాలర్లు ఇవ్వండం తమకు సంతోషంగానే ఉందని తెలిపారు ట్రంప్‌..

ట్రంప్‌ ఫౌండేషన్‌ నిధుల దుర్వినియోగాన్ని ఎత్తి చూపడం ద్వారా సేవా కార్యక్రమాలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా తాము చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని అంటున్నారు న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ లిటిటియా జేమ్స్‌.. కాగా ఫౌండేషన్‌ నిధుల దుర్వినియోగం నిజమేనని గత ఏడాది డిసెంబర్‌లోనే అధ్యక్షుడు ట్రంప్‌ అంగీకరించారు. భవిష్యత్తులో తాము చేపట్టే సేవా కార్యక్రమాల్లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు.