తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల 74 లక్షలు వచ్చింది. ఇవాళ గురువారం కావడంతో ప్రత్యేక దర్శనాలు ఉదయం 9 గంల నుంచి సాయంత్రం 7 గంటలవరకూ ఉంటాయి. ఉదయం 10 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, 11 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్జిత బ్రహ్మోత్సవం, 2 గంటలకు వసంతోత్సవం, సాయంత్రం 5 గంటలకు దీపాలాంకరణ సేవ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *