వరుసగా మూడో రోజూ తమిళనాడులో ఐటీ దాడులు

చెన్నైలో నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. ట్రక్కుల కొద్దీ నోట్లు బయటపడుతున్నాయి. వేలూరులో దొరికిన నోట్ల కట్ట‌లను చూసి ఐటీ అధికారులే షాక్‍కు గురయ్యారు. ఐటీ అధికారులు డీఎంకే నేతల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‍కు చెందిన సొంత మెడికల్ కాలేజీ, సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ఐటీ అధికారులు దాడులు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్‍లో చేపట్టిన తనిఖీల్లో మూటలు మూటలుగా పెద్ద పెద్ద అట్ట […]

వరుసగా మూడో రోజూ తమిళనాడులో ఐటీ దాడులు
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2019 | 10:48 AM

చెన్నైలో నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. ట్రక్కుల కొద్దీ నోట్లు బయటపడుతున్నాయి. వేలూరులో దొరికిన నోట్ల కట్ట‌లను చూసి ఐటీ అధికారులే షాక్‍కు గురయ్యారు. ఐటీ అధికారులు డీఎంకే నేతల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‍కు చెందిన సొంత మెడికల్ కాలేజీ, సిమెంట్ ఫ్యాక్ట‌రీలో ఐటీ అధికారులు దాడులు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ గోడౌన్‍లో చేపట్టిన తనిఖీల్లో మూటలు మూటలుగా పెద్ద పెద్ద అట్ట పెట్టెల్లో భారీగా నగదు పట్టుబడింది. దీన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు 20 కోట్ల రూపాయలుగా గుర్తించారు. నగదును రిజర్వ్ బ్యాంక్‍కు తరలించారు.

అనితా రాధాకృష్ణన్‍కు చెందిన ఇళ్ళు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.తూత్తుకుడిలో వీరికి చెందిన భారీ నగదు నిల్వల్ని స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చెందూర్‍లో దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 20 కోట్ల రూపాయల నగదు 10 కిలోల బంగారు నాణాలు లభ్యమయ్యాయి. సంబంధిత వీడియోలను అధికారులు విడుదల చేశారు. ఈ వీడియోలు తమిళనాట సంచలనంగా మారాయి.