అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు

Huband kills wife in kamareddy district Husband absconded, అనుమానంతో భార్య హత్య.. అనాధలుగా మిగిలిన చిన్నారులు

అనుమానం పెనుభూతమంటారు.. అదే అనుమానంతో ఎన్నో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. ఐదేళ్ల కాపురం చేసిన భార్య,భర్తల మధ్య అనుమానం వారిమధ్య దూరాన్ని పెంచింది. దీని ఫలితం ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు పరారీలో ఉన్నారు.

కామారెడ్డి జిల్లా నస్రూలాబాద్ మండలానికి చెందిన జ్యోతి, నిర్మల్ జిల్లా కడెం గ్రామానికి చెందిన రాజు ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం పెను ప్రకంపనలు రేపింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న రాజు  ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఒకటిరెండుసార్లు పెద్దల్లో కూర్చుని పంచాయతీలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో జూలై29న ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆమెను తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు జ్యోతిని హస్పిటల్‌కు తరలించారు. చివరికి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈ ఘటనపై మృతురాలు జ్యోతి సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు రాజు పరారీలో ఉండగా తల్లిని పోగొట్టుకుని, తండ్రి కనిపించక చిన్నారులిద్దరూ కన్నీటి పాలవుతున్న దృశ్యం అక్కడున్నవారిని కంటతడి పెట్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *