4 కెమెరాలతో ‘హువావే పీ30 ప్రో’ స్మార్ట్‌ఫోన్

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి పేర్లు పీ30, పీ30 ప్రో. పీ30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇక పీ30 ఫోన్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో తెలియాల్సి ఉంది. పీ30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.47 అంగుళాల స్క్రీన్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాడ్ కెమెరాలు (40 ఎంపీ+20 ఎంపీ+ […]

4 కెమెరాలతో ‘హువావే పీ30 ప్రో’ స్మార్ట్‌ఫోన్
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 7:06 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి పేర్లు పీ30, పీ30 ప్రో. పీ30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో ఏప్రిల్ 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఇక పీ30 ఫోన్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో తెలియాల్సి ఉంది.

పీ30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.47 అంగుళాల స్క్రీన్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, క్వాడ్ కెమెరాలు (40 ఎంపీ+20 ఎంపీ+ 8 ఎంపీ+టీవోఎఫ్) వంటి ప్రత్యేకతలున్నాయి. అలాగే ఇందులో 7 ఎన్ఎం కిరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ/512 జీబీ మెమరీ, 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.71,990గా ఉంది. ఫోన్‌లోని క్వాడ్ కెమెరాలు 5ఎక్స్ జూమ్, 10ఎక్స్ జూమ్, 50ఎక్స్ జూమ్ సపోర్ట్ చేస్తాయి.

ఇక పీ30 స్మార్ట్‌ఫోన్‌లో 6.15 అంగుళాల స్క్రీన్, 12 ఎన్ఎం కిరన్ 710 ప్రాసెసర్, 4 జీబీ/6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 3,340 ఎంఏహెచ్ బ్యాటీ, 24 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఇందులో 4 జీబీ ర్యామ్ ధర రూ.19,990గా, 6 జీబీ ర్యామ్ ధర రూ.22,990గా ఉంది.