Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

అందుబాటు ధరలో… అదిరిపోయే ఫీచర్లతో హువావే ఎంజాయ్ 10!

Huawei Enjoy 10 With 48 Megapixel Camera 4000mAh Battery Launched, అందుబాటు ధరలో… అదిరిపోయే ఫీచర్లతో హువావే ఎంజాయ్ 10!

దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే అదిరిపోయే ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. హువావే ఎంజాయ్ 10 పేరిట ఈ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. ఇందులో 48 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా, పంచ్ హోల్ సెల్పీ కెమెరాతో కూడిన డిస్ ప్లే కూడా ఉండటం విశేషం.

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.12,000 ఉండగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ల ధరను సుమారు రూ.14,000 గా నిర్ణయించారు. హువావే ఎంజాయ్ ఫోన్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం కాగా, అమ్మకాలు నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఫోన్ యాసిషియా రెడ్, అరోరా బ్లూ, బ్రీతింగ్ క్రిస్టల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

ఇందులో 6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే అందుబాటులో ఉంది. పంచ్ హోల్ డిస్ ప్లేతో విడుదలైన ఈ ఫోన్ లో స్క్రీన్ టు బాడీ రేషియో 90.15 శాతంగా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 720×1560 పిక్సెల్స్ గా ఉంది. ఆక్టాకోర్ హై సిలికాన్ కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేయనుంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికి వస్తే, ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా అపెర్చర్ f/1.8గా ఉంది. 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. దీని అపెర్చర్ f/2.4గా ఉంది. సెల్పీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను అందించారు. దీని అపెర్చర్ f/2.0. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఫోన్ లో ఉండే ఫైల్స్ ట్రాన్స్ ఫర్ కోసం యూఎస్ బీ పోర్ట్ ను అందించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న అన్ని ఫోన్లలో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను ఇందులో హువావే అందించలేదు. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత ఈఎంయూఐ 9.1పై ఈ ఫోన్ పనిచేయనుంది.

Related Tags