మారుతీరావుపై టాలీవుడ్ దర్శకుడి సంచలన పోస్ట్…

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మార్చి 8న బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సోమవారం మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా ప్రణయ్ హత్య జరిగిన్పటి నుంచి మారుతీరావును కొందరు సపోర్ట్ చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేశ్(స్టివెన్ శంకర్) వ్యంగ్యంగా స్పందించారు. మారుతీ రావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ ఆయన ఫోస్‌బుక్‌లో […]

మారుతీరావుపై టాలీవుడ్ దర్శకుడి సంచలన పోస్ట్...
Follow us

|

Updated on: Mar 10, 2020 | 3:28 PM

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మార్చి 8న బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సోమవారం మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా ప్రణయ్ హత్య జరిగిన్పటి నుంచి మారుతీరావును కొందరు సపోర్ట్ చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ దర్శకుడు సాయి రాజేశ్(స్టివెన్ శంకర్) వ్యంగ్యంగా స్పందించారు. మారుతీ రావు చనిపోయిన రోజుని ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ ఆయన ఫోస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు.

“అమ్మా చిట్టి తల్లి….బంగారు తల్లి…18 ఏళ్ళు నిన్ను గారాబంగా పెంచాను…పెన్సిలు, రబ్బరు, బొట్టుబిళ్ళ, పప్పరమిట్టు….ఏది అడిగితే అది….ఇదంతా ఎందుకోసం ?? నేను ఏ మలపత్రాష్టుడిని తెచ్చినా…. తలదించుకొని తాళి కట్టించికొని ఆదర్శ నారిగా నిలుస్తావని…ఏమన్నా అంటే…నీ భర్త ని చంపించావు అంటావే ? 20 లక్షలు ఒక కిరాయి హాంతకుడికి ఇచ్చినప్పుడు… అందులో ప్రతి నోటు…నాన్న ప్రేమతో తపించిపోయాయి…. అల్లుడిని చంపానే కానీ…నిన్ను కాదుగా…అక్కడైన నీకు నా ప్రేమ అర్థం కాలేదా ??? గర్భవతిగా ఉన్న కూతురు కోసం ఒక మర్డర్ చేయిస్తే… అది తండ్రి ప్రేమ…చనిపోయిన కుర్రాడి తండ్రిది మాత్రం కుట్ర అనుకునే గొర్రెగాళ్ళు నా అభిమానులు… వాళ్ళకే నా ప్రేమ అర్థం అయింది… నీకెందుకు కాలేదు…పర్లేదు….నన్ను అభిమానిస్తున్న ప్రతి ఇంట్లో కూతురికి నేను తండ్రిగా వస్తా…. ప్రతి కొడుక్కి మామా గా వస్తా…..”అంటూ సంచలన పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ పోస్ట్‌కి ‘నీకో కూతురు ఉంది…15 ఏళ్లకే ప్రేమించి వెళ్ళిపోతే తెలుస్తుంది ఆ తండ్రి బాధ.. తండ్రిలా ఆలోచించు’.. అని ఒక నెటిజన్ రిప్లై ఇవ్వగా.. ‘నీకో పెళ్ళాం ఉంది…ఆమె నిండు గర్భంతో వున్నప్పుడు నిన్ను ఆమె ముందే నరికేస్తే అప్పుడు తెలుస్తుంది ఆమె బాధ.. మనిషిలా ఆలోచించు’ అంటూ కౌంటర్ అటాక్ చేశారు సాయి రాజేష్. ఈయన సంపూర్ణేశ్ బాబు హీరోగా ‘హృదయ కాలేయం’ మూవీని డైరెక్ట్ చేశారు.