Breaking News
  • భారత సైనిక విమానానికి చైనా అనుమతి. నేడు వూహాన్‌ వెళ్లనున్న వైద్య పరికరాలతో కూడిన సైనిక విమానం.చైనా అధికారులకు వైద్య పరికరాలు అందజేయనున్న అధికారులు. 27న వూహాన్‌ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురానున్న విమానం.
  • నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.11 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు.వచ్చే నెల 4న స్వామి కల్యాణం, 5న రథోత్సవం.ఉత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం రద్దు.
  • నేటి నుంచి ఏపీ లోకాయుక్త కార్యకలాపాలు. ఇప్పటి వరకు ఒకేచోట ఉన్న ఏపీ, తెలంగాణ లోకాయుక్తలు.హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని ఓ భవనంలోకి మారుతున్న లోకాయుక్త.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు
  • ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ. మౌజ్‌పూర్‌, జాఫరాబాద్‌, కర్నాల్‌నగర్‌, చాంద్‌బాగ్‌లో కర్ఫ్యూ.సీఏఏ అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ విధించిన పోలీసులు.ఆందోళనల్లో ఇప్పటి వరకు 13 మంది మృతి. ఢిల్లీ సరిహద్దులను మూసివేసిన పోలీసులు.
  • ఈశాన్య ఢిల్లీలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన మనీష్‌ సిసోడియా.నేడు జరగాల్సిన 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా.తూర్పు, ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాయిదా.
  • ఇండోనేషియాలో వరద బీభత్సం.జకార్తాను ముంచెత్తిన వరదలు.భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న నదులు.వరద నీటిలో చిక్కుకున్న అధ్యక్ష భవనం.జలదిగ్భందంలో వేలాది ఇళ్లు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

సోదరిని వేధిస్తోన్న హృతిక్..కంగనా సిస్టర్ ట్వీట్

, సోదరిని వేధిస్తోన్న హృతిక్..కంగనా సిస్టర్ ట్వీట్

ముంబయి: బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ అతని సోదరి సునైనాను హింసిస్తున్నారని నటి కంగనా రనౌత్‌ సిస్టర్ రంగోలీ సంచలన ఆరోపణలు చేశారు. కాగా హృతిక్‌కు, కంగనాకు గతంలో తీవ్ర మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.  హృతిక్‌ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన అప్పట్లో ఆరోపించింది. కేసుల వరకు కూడా వెళ్లింది వ్యవహారం.

అయితే.. ఈ మధ్యకాలంలో హృతిక్ సోదరి.. సునైనాకు ఆమె కుటుంబ సభ్యులకు మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో కంగనకు సునైనా మద్దతు తెలుపుతూ తన సోదరుడు హృతిక్‌దే తప్పంటూ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సునైనా ఢిల్లీకి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నారని..ఆ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోకపోవడమే కాకుండా..ఆమెను తీవ్రంగా వేదనకు గురిచేశారని రంగోలి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. సునైనా సాయం కావాలంటూ పదే..పదే కంగనాకు ఫోన్ చేస్తుందని..కానీ ఏ విధంగా హెల్ప్ చేయాలో తమకు అర్ధం కావట్లేదని రంగోలి చెప్పుకొచ్చారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమెను పోలీసులతో కూడా వేధిస్తున్నారని..తన భద్రత దృష్ట్యానే ఈ విషయాన్ని బయటకు వెల్లడిస్తున్నానని..కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్‌ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నానని రంగోలి తెలిపారు.

Related Tags