బిగ్‌బీ రీమేక్‌పై కన్నేసిన హృతిక్..?

Hrithik Roshan, బిగ్‌బీ రీమేక్‌పై కన్నేసిన హృతిక్..?

సక్సస్ కోసం స్టార్ హీరోలందరూ రీమేక్ మూవీలపై మొగ్గు చూపుతున్నారు. త్వరలో సూపర్ 30 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హృతిక్ రోషన్.. 1982వ సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించిన సత్తే పే సత్తా చిత్ర రీమేక్‌లో నటించేందుకు సిద్దమయ్యాడు. ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్టుగా టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం షారూఖ్‌ని అనుకున్నారు కాని మిడిల్ ఏజ్ హీరో అయితే క‌థ‌కి స‌రిగ్గా స‌రిపోతుందని భావించిన నిర్మాత‌లు హృతిక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. ఈ ప్రాజెక్ట్‌కి హృతిక్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఏడాది లోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం విడుదల చేసే ప్లానింగ్‌లో టీమ్ కసరత్తు ప్రారంభించారు. స‌త్తా పే స‌త్తా చిత్రం అమితాబ్ కెరీర్‌లో మంచి హిట్ చిత్రంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఏడుగురు అన్నదమ్ముల కథగా దర్శకుడు ఎన్ సిప్పి మలచిన తీరు ప్రేక్ష‌కుల్ని వావ్ అనిపించింది. ఇక హేమామాలిని నటన కుర్రాళ్ళుగా చేసిన సోదర బ్యాచ్ అటు అల్లరి ఇటు ఎమోషన్ రెండు బాలన్స్ చేస్తూ సూపర్ హిట్ అందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *