వెంటిలేటర్‌ విడిభాగాలను 3డీ ప్రింటింగ్ చేయనున్న హెచ్‌పీ..!

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య పరికరాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్ పరికరాల అవసరం మరింత ఎక్కువైంది. భారత్ లో ఫ్రంట్ వారియర్స్ కి మద్దతుగా నిలిచింది హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ.

వెంటిలేటర్‌ విడిభాగాలను 3డీ ప్రింటింగ్ చేయనున్న హెచ్‌పీ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 05, 2020 | 5:05 PM

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైద్య పరికరాల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో వెంటిలేటర్ పరికరాల అవసరం మరింత ఎక్కువైంది. భారత్ లో ఫ్రంట్ వారియర్స్ కి మద్దతుగా నిలిచింది హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ. భారత్‌లో హెల్త్‌కేర్‌ కోసం 1.2 లక్షల వెంటిలేటర్‌ విడిభాగాలను ఉత్పత్తి చేయడానికి ఏజీవీఏ ముందకొచ్చింది. ఈ మేరకు రెడింగ్టన్‌ 3డీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు హెచ్‌పీ తెలిపింది. ఇందులో భాగంగా 10,000 వెంటిలేటర్ల తయారీ కోసం 12 విభాగాలకు చెందిన విడి భాగాలను 3డీ ప్రింటింగ్‌ చేయన్నుట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రోగుల చికిత్సలో ఈ వెంటిలేటర్లను వినియోగించనున్నట్లు వెల్లడించింది. 3డీ ప్రింటింగ్‌ చేయనున్న భాగాల్లో ఇన్‌హేల్‌, ఎక్స్‌హేల్‌ కనెక్టర్లు, వాల్వ్‌ హోల్డర్లు, ఆక్సిజన్‌ నాజిళ్లు, సోల్‌నాయిడ్‌ మౌంట్లు వంటివి ఉన్నాయి. ఈ విడిభాగాల డిజైన్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది. సంప్రదాయ ప్రక్రియలో వీటిని తయారు చేయడానికి 4-5 నెలల సమయం పడుతుంది. హెచ్‌పీ 3డీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఈ భాగాలను కేవలం 24 రోజుల్లో రూపొందించవచ్చంటున్నారు హెచ్‌పీ ప్రతినిధులు.