భారత్‌కు నిజమైన మిత్రుడు ట్రంప్.. మోదీ

భారత్‌కు నిజమైన మిత్రుడు డోనాల్ట్ ట్రంప్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమానికి మోదీ ఆహ్వానంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా స్థలికి విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ట్రంప్‌ను వేదికపైకి తీసుకెళ్లారు. హోస్టన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరువురు నేతలు ప్రసంగించారు. తొలుత ప్రధాని మోదీ స్వాగత […]

భారత్‌కు నిజమైన మిత్రుడు ట్రంప్.. మోదీ
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 2:44 AM

భారత్‌కు నిజమైన మిత్రుడు డోనాల్ట్ ట్రంప్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఏర్పాటు చేసిన ‘హౌడీ- మోదీ’ కార్యక్రమానికి మోదీ ఆహ్వానంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా స్థలికి విచ్చేసిన ట్రంప్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ట్రంప్‌ను వేదికపైకి తీసుకెళ్లారు. హోస్టన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరువురు నేతలు ప్రసంగించారు. తొలుత ప్రధాని మోదీ స్వాగత ఉపన్యాసం చేశారు. ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించగా.. మళ్లీ ప్రధాని మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు.

కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని మోదీ.. తనను ఆహ్వానించిన హ్యూస్టన్ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఎంత శక్తివంతుడో ప్రపంచానికి తెలుసన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టమని.. అంతేకాదు భారత్‌లో కూడా ట్రంప్ చాలా పాపులర్ అని అన్నారు. ట్రంప్‌కు ఇంట్రడక్షన్ అవసరం లేదన్నారు. ట్రంప్‌ను కలిసే అవకాశాలు నాకు తరచుగా లభించాయన్నారు. ప్రతి సందర్భంలోనూ అత్యంత స్నేహపూర్వకంగా ట్రంప్ వ్యవహరిస్తారన్నారు. భారత్‌కు నిజమైన శ్వేతసౌధ స్నేహితుడు ట్రంప్‌ అని.. కొన్నేళ్లుగా భారత్‌- అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయన్నారు. ఇప్పుడు ట్రంప్‌, మోదీ కాదు.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల సమాగమం ఇది అన్నారు. హ్యూస్టన్‌ నుంచి ఈ కొత్త స్నేహగీతం కొనసాగుతుందని.. అందుకు ఈ సభ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందని అన్నారు. అంతేకాదు రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల ముందు అబ్ కీ బార్ మోదీ సర్కార్.. అన్న నినాదాన్ని.. అక్కడ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినదించారు. ఈ దీపావళి సంబరాల్లో ట్రంప్‌ మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తెలుగతో పాటు.. పలు భాషల్లో మోదీ మాటలు

‘హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్న మోదీ … అందరూ బాగున్నారా అంటూ పలు భారతీయ భాషల్లో మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. భారతదేశంలోని భాషలు.. స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక అని వాఖ్యానించారు. అనేక భాషలు, సంస్కృతులు ఉన్నా ఒక దేశం మా విధానం అని అన్నారు. అనేక ఆచారాలు, వేషభాషలు, పూజావిధానాలు మా సొంతమని.. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ జీవన సంస్కృతి అంటూ భారతీయ సంస్కృతి గురించి వివరించారు. ఈ సభలో ఉన్న50 వేల మంది కూడా భారతీయ సంస్కృతికి ప్రతినిధులన్నారు.

ఇప్పుడున్నది అత్యంత బలమైన ప్రభుత్వం

అమెరికా జనాభా కంటే రెట్టింపు ప్రజలు ఈ సారి భారతీయ ఎన్నికల్లో పాల్గొన్నారని మోదీ అన్నారు. భారత్‌లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8కోట్ల మంది కొత్త ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. గత 60 ఏళ్ల తర్వాత భారత్‌లో అత్యంత బలమైన ప్రభుత్వం ఈ సారి ఏర్పడిందన్నారు. గడిచిన ఐదేళ్ల పాలన తర్వాత.. మరింత శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదంతా మోదీ ప్రతిభ వల్ల జరిగింది కాదని.. భారతీయుల సంకల్పం వల్ల జరిగిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు భారత ప్రగతికి నిదర్శనమన్నారు.

మాకు మేమే పోటీ..

ప్రస్తుతం భారత్ ప్రజా భాగస్వామ్యంతో నడుస్తోందన్నారు మోదీ. సంకల్పం నుంచి సాకారం వరకు… అన్న మోదీ.. ఇదే భారత్ కొత్త నినాదం అన్నారు. నవీన భారత నిర్మాణమే ఈ సంకల్పానికి లక్ష్యంమని.. మమ్మల్ని మేమే పోటీదారులుగా భావిస్తున్నామన్నారు. 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశామని.. గత ఐదేళ్లలో 2లక్షల కి.మీ. మేర గ్రామీణ రోడ్లు నిర్మించామన్నారు. అంతేకాదు వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానం చేయగలిగామన్నారు. 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించామని మోదీ వివరించారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతా.. : ట్రంప్

ఇక హౌడీ, మోదీ కార్యక్రమానికి వచ్చేసిన ప్రవాస భారతీయులనుద్దేశించి.. ట్రంప్ ప్రసంగించారు. ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు ట్రంప్. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతోనే సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా లేచి చప్పట్లు కొడుతూ.. కరతాల ధ్వనులు చేస్తూ.. నిల్చుని అభివాదం తెలిపారు. భారత్‌- అమెరికాల స్వప్నాలు సాకారం చేసేందుకు మోదీతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. భారత్‌ అత్యున్నత విలువలు, సంస్కృతి… అమెరికా విలువలతో కలిసిపోతాయన్నారు. గత కొన్నేళ్లుగా భారత్‌-అమెరికా సంబంధాలు ఎన్నడూలేనంత బలోపేతం అయ్యాయన్నారు. నాలుగేళ్లలో కోటీ 40లక్షల మందికి ఉద్యోగాల కల్పన జరిగిందని. పన్నుల హేతుబద్ధతతో కొత్త ఉద్యోగాలకు కల్పన జరిగిందన్నారు. భారత్‌- అమెరికాలు రక్షణ ఉత్పత్తుల భాగస్వాములుగా మారుతున్నాయపన్న ట్రంప్.. సరిహద్దు భద్రత అనేది భారత్‌, అమెరికాకు అత్యంత ప్రాధాన్యత అంశమన్నారు. సరిహద్దు భద్రత అంశంలో భారత్‌కు సహకరిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇరుదేశాలనూ నూతన పథంలోకి నడిపిస్తున్నాయని.. మోదీ ప్రభుత్వం 30 కోట్ల మందికి పేదరికాన్ని దూరం చేసిందని.. 40 కోట్ల మంది బలమైన మధ్యతరగతి ప్రజలు భారత్‌ ఆస్తి అన్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!