ఏడాది క్రితం జీరో…నేడు హీరో

విజయ్ శంకర్.. నాగ్‌పూర్ వన్డే తర్వాత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కలవరిస్తున్న పేరిది. భారత్ విజయానికి స్టోయినిస్ అడ్డుగా ఉన్న వేళ ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న విజయ్ శంకర్ తొలి బంతికే స్టోయినిస్‌ను ఎల్బీ చేశాడు. మూడో బంతికి ఆడమ్ జంపాను క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్‌లోనూ విజయ్ శంకర్ మెరుపులు మెరిపించాడు. పరుగులు చేయడానికి మిగతా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్న పిచ్ మీద ధాటిగా ఆడి 41 బంతుల్లోనే 46 […]

ఏడాది క్రితం జీరో...నేడు హీరో
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 11:10 AM

విజయ్ శంకర్.. నాగ్‌పూర్ వన్డే తర్వాత దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కలవరిస్తున్న పేరిది. భారత్ విజయానికి స్టోయినిస్ అడ్డుగా ఉన్న వేళ ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న విజయ్ శంకర్ తొలి బంతికే స్టోయినిస్‌ను ఎల్బీ చేశాడు. మూడో బంతికి ఆడమ్ జంపాను క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. బ్యాటింగ్‌లోనూ విజయ్ శంకర్ మెరుపులు మెరిపించాడు. పరుగులు చేయడానికి మిగతా బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్న పిచ్ మీద ధాటిగా ఆడి 41 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు.

ఏడాది క్రితం విజయ్ శంకర్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌‌లో ట్రోల్ చేశారు. నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారీ షాట్లు ఆడటంలో విజయ్ శంకర్ విఫలం కావడమే దీనికి కారణం.

ఆ తరువాత విజయ్ శంకర్ కసితో ఆడాడు. ఇండియా-ఏ తరఫున న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విజయ్ శంకర్ ద్రవిడ్ శిక్షణలో ఫినిషర్‌గా మారాడు. దీంతో అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వచ్చిన అవకాశాన్నికూడా శంకర్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇదే ఆట కొనసాగిస్తే అతడికి వరల్డ్ కప్ బెర్త్ ఖాయం.