Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్… ఎలా?

How To Use 2 Whatsapp Accounts On Same Android Phone, ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్… ఎలా?

ఫేస్ బుక్, ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో సులువుగా లాగవుట్ చేసి తిరిగి లాగిన్ అవ్వడం ద్వారా వివిధ ఖాతాల నిర్వహణ సులభం అవుతుంది. కానీ వాట్సాప్ లో లాగవుట్ చేసి లాగిన్ చేయడం అంత సులభం కాదు. కానీ కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లను ఉపయోగించవచ్చు. ఇలా ఏ యాప్ అయినా రెండు ఒకే మొబైల్ లో వాడుకోవచ్చు. దాన్నే పారలల్ స్పేస్ అని అంటారు.ఈ పారలల్ స్పేస్ ని వాడటం రెండు రకాలుగా సాధ్యపడుతుంది. ఒకటి ఫోన్ లో ఇన్ బిల్ట్ గా పారలల్ స్పేస్ ఉండటం, రెండూ పారలల్ యాప్స్ అందించే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం.

కొన్ని కంపెనీల ఫోన్లలో డ్యూయల్ యాప్స్ ఉపయోగించేందుకు ప్రత్యేకమైన ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించడం ద్వారా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించవచ్చు. షావోమి ఫోన్లలో అయితే ‘Dual apps’, శాంసంగ్ లో ‘Dual Messenger’, ఒప్పోలో ‘Clone apps’, వివోలో ‘App Clone’, అసుస్ లో ‘Twin apps’, హువావే, హానర్ ఫోన్లలో అయితే ‘App twin’ ఫీచర్లను ఉపయోగించి రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.

  • ముందుగా వాట్సప్ యాప్‌రు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్‌తో వాట్సప్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
  • ఒకవేళ మీ ఫోన్‌లో వాట్సప్ ఆల్ రెడీ ఇన్‌స్టాల్ చేసి ఉంటే మాత్రం అవసరం లేదు. వాట్సప్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
  • ఆ తర్వాత ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోని యాప్స్‌‌లోకి వెళ్లాలి. అక్కడ డ్యూయెల్ యాప్/క్లోన్ యాప్/యాప్ ట్విన్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి. అందులో వాట్సప్ ఎంచుకోండి.
  • ఫోన్ యాప్స్‌లో రెండు వాట్సప్‌లు కనిపిస్తాయి. ఇంకొక నెంబర్‌పై రెండో అకౌంట్‌ కూడా క్రియేట్ చేసుకోండి. అయితే ఒకవేళ మీ ఫోన్‌లో డ్యూయెల్ ఉంటే ఓకే లేకపోతే మాత్రం పారలెల్ స్పేస్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

ఒకవేళ మీరు పైన పేర్కొన్న ఫోన్లు కాకుండా వేరే ఫోన్లు ఉపయోగిస్తున్నట్లయితే, ప్లేస్టోర్ లో లభించే Parellel space, Dual App Wizard, Double App వంటి యాప్ ల ద్వారా మీ యాప్ ను క్లోన్ చేసుకుని రెండో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు.

ఐఫోన్ వినియోగదారులకు ఇలా డ్యూయల్ యాప్ ద్వారా వాట్సాప్ ను ఉపయోగించే అవకాశం లేదు కానీ, వాట్సాప్ బిజినెస్ అని యాప్ స్టోర్ లో ఒక యాప్ ఉంటుంది. అదే యాప్ ప్లేస్టోర్ లో కూడా ఉంటుంది కానీ, ఆండ్రాయిడ్ వినియోగదారులకు దీన్ని ఉపయోగించేంత అవసరం రాదు. కానీ ఐవోఎస్ వినియోగదారులకు మాత్రం రెండో వాట్సాప్ ఖాతా కావాలంటే ఇది ఉపయోగించక తప్పదు. కాబట్టి ఐవోఎస్ లో రెండో వాట్సాప్ ఖాతా కావాలంటే యాప్ స్టోర్ లోకి వెళ్లి Whatsapp Business యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి.

ఎలాంటి థార్డ్ పార్టీ యాప్ సహాయం లేకుండా పారలల్ స్పేస్ ని వాడటం XIAOMI MI ఫోన్స్ లో సాధ్యపడుతుంది.మీరే గనుక షియోమి ఫోన్ వాడుతోంటే , అందులో MIUI-8 రన్ అవుతోంటే సెకన్లలో వాట్సాప్ రెండొవ ఖాతా తెరవొచ్చు.ఒకటి Settings లొకి వెళ్ళి System & Device సెట్టింగ్స్ లో ఉండే Second Space ని ఆన్ చేయడం ద్వారా.ఇది ఆన్ చేయగానే మీ మొబైల్ లో సెకండ్ స్పేస్ వచ్చేస్తుంది.ఆ స్పేస్ లో మీరు అన్ని యాప్స్ ని రెండొవసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

స్పేస్ మొత్తాన్ని ప్రైవేట్ గా వాడుకోవచ్చు.అలా కాకుండా, దాని కిందే Device సెక్షన్ లో ఉండే Dual Apps లో మీకు ఇష్టం వచ్చిన యాప్ ని డూప్లికేట్ చేసుకోవచ్చు.ఇక మీద దగ్గర షియోమి ఫోన్ లేకపోయినట్లయితే, స్టోర్ లో రెండేసి యాప్స్ అందించే యాప్స్ బాగానే దొరుకుతున్నాయి. అందులో Parallel Space అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోని ఇష్టమైన యాప్స్ ని డూప్లికేట్ చేసుకోండి.

Related Tags