సముద్రంలో పెట్రోల్.. ఎలా తయారవుతుందో మీకు తెలుసా?

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. కేవలం ఒక్క రోజు పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోతే ప్రపంచమంతా స్తంభించిపోతుంది. రోజుకు కొన్ని కోట్ల మంది వీటిని ఉపయోగిస్తూంటారు. ఇప్పుడు కనీసం వెహికల్స్ లేని ఇళ్లే ఉండటం లేదు. పెట్రోల్‌ లేదా డీజిల్‌ లీటర్‌పై ధర ఒక్క రూపాయి పెరిగినా అమ్మో అని నోళ్లు వెళ్లబెడుతూంటారు. కానీ ఆ పెట్రోల్, డీజిల్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో? వాటికి ఎంత్ర శ్రమ పడాల్సి వస్తుందో మీకు తెలుసా? ఏదేనా […]

సముద్రంలో పెట్రోల్.. ఎలా తయారవుతుందో మీకు తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Feb 08, 2020 | 9:37 PM

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. కేవలం ఒక్క రోజు పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకపోతే ప్రపంచమంతా స్తంభించిపోతుంది. రోజుకు కొన్ని కోట్ల మంది వీటిని ఉపయోగిస్తూంటారు. ఇప్పుడు కనీసం వెహికల్స్ లేని ఇళ్లే ఉండటం లేదు. పెట్రోల్‌ లేదా డీజిల్‌ లీటర్‌పై ధర ఒక్క రూపాయి పెరిగినా అమ్మో అని నోళ్లు వెళ్లబెడుతూంటారు. కానీ ఆ పెట్రోల్, డీజిల్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో? వాటికి ఎంత్ర శ్రమ పడాల్సి వస్తుందో మీకు తెలుసా?

ఏదేనా ఒక జంతువు భూమిపై చనిపోతే అది ఆక్సిజన్ వల్ల కుళ్లిపోయి భూమిలో కలిసిపోతుంది. కానీ సముద్రంలో మాత్రం జలచరాలు చనిపోతే.. అడుగు భాగానికి చేరుకుంటాయి. ఇలా చనిపోయిన కళేబరాలపై ఇసుక, మొక్కలు పేరుకుపోయి కొన్ని లేయర్స్‌గా ఏర్పడుతాయి. అయితే.. సముద్రంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. చనిపోయిన జంతువులు కుళ్లిపోకుండా.. కెరోజన్(Kerogen) అనే పదార్థంగా మారుతుంది.

అలా వీటిపైన కొన్ని సంవత్సరాల పాటు ఇసుక, బురద క్రమంగా పేరుకుపోవడం వల్ల లోపల టెంపరేచర్ ప్రెజర్ పెరిగి.. కెరోజన్ క్రూడాయిల్‌గా లేదా న్యాచురల్ గ్యాస్‌గా మారిపోతుంది. లోపల టెంపరేచర్ 80 నుంచి 120 డిగ్రీల సెల్సియస్ ఉంటే కెరోజన్ క్రూడాయిల్‌గా, 120 నుంచి 150 డిగ్రీల సెల్సియస్ ఉంటే కెరోజన్ న్యాచురల్ గ్యాస్‌గా మారుతుంది.

ఇలా ఒక జంతువు క్రూడాయిల్‌గా మారడానికి దాదాపు 22 లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మనం ఇప్పుడు వాడే పెట్రోల్, డీజిల్ లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన జంతువుల నుంచి వచ్చిందే. ఇలా ఒక్క లీటర్ పెట్రోల్ తయారవడానికి దాదాపు 22 వేల కిలోల మెటీరియల్ కావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. క్రూడాయిల్ తయారు చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. క్రూడాయిల్‌ని బయటకు తీసి, కొన్ని రకాలైన పద్దతులను వాడటం వల్ల పెట్రోల్, డీజిల్‌లు తయారవుతాయి.