ఇక వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు..! సెట్టింగ్స్ ఇలా..?

వాట్సాప్.. వాట్సాప్.. ప్రస్తుతం ఈ టెక్నాలజీ.. అందరినీ దగ్గర చేస్తుంది. దీంతో.. మరో అడుగు ముందుకేసిన వాట్సాప్ దిగ్గజం.. సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించిన సెట్టింగ్ వివరాలు కూడా.. తెలిపారు ఆ సంస్థ అధికారులు. ప్రస్తుతం ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా.. అందరి వద్దా స్మార్ట్స్ ఫోన్స్‌ ఉంటున్నాయి. ఇక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి అయితే.. చెప్పనవసరం లేదు. ఏ కొత్త చుట్టం కలిసినా.. ఇట్టే ఫ్యామిలీ గ్రూప్స్ క్రియేట్ […]

ఇక వాట్సాప్ గ్రూపుల్లో చేర్చడం అంత సులువు కాదు..! సెట్టింగ్స్ ఇలా..?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 23, 2019 | 11:39 AM

వాట్సాప్.. వాట్సాప్.. ప్రస్తుతం ఈ టెక్నాలజీ.. అందరినీ దగ్గర చేస్తుంది. దీంతో.. మరో అడుగు ముందుకేసిన వాట్సాప్ దిగ్గజం.. సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించిన సెట్టింగ్ వివరాలు కూడా.. తెలిపారు ఆ సంస్థ అధికారులు.

ప్రస్తుతం ఇప్పుడు చిన్నా.. పెద్దా తేడా లేకుండా.. అందరి వద్దా స్మార్ట్స్ ఫోన్స్‌ ఉంటున్నాయి. ఇక ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కి అయితే.. చెప్పనవసరం లేదు. ఏ కొత్త చుట్టం కలిసినా.. ఇట్టే ఫ్యామిలీ గ్రూప్స్ క్రియేట్ చేయడం.. చకాచకా.. చాటింగ్‌లు చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే.. కొన్ని సార్లు మనకు తెలియని వ్యక్తులు కూడా.. గ్రూపుల్లో చేర్చుతున్నారు. దీంతో.. అది తలనొప్పిగా మారుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ.. కొత్త ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్ సంస్థ.

అలాగే.. గ్రూపుల్లో మిమ్మల్ని చేర్చుకోవాలన్నా.. పర్మిషన్ అడిగేలా.. వాట్సాప్.. సెట్టింగ్స్ చేసింది. అంతేకాకుండా గ్రూపులో మిమ్మల్ని ఎవరు చేర్చాలి అనేది కూడా మీరే నిర్ణయించుకోవచ్చట. అదెలాగంటే.. కొత్త అప్‌డేట్ సెట్టింగ్స్‌లో గ్రూప్ ప్రైవసీ.. సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ప్రైవసీ సెట్టింగుల్లో.. గ్రూపు అడ్మిన్‌పై క్లిక్‌ చేసి.. అందులో ఎవిరీవన్, మై కాంటాక్ట్స్, మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.

1. ఎవిరీవన్‌ను ఎంపిక చేసుకుంటే.. ఎవరైనా మిమ్మల్ని గ్రూపులో చేర్చేందుకు వీలుంటుంది. 2. మై కాంటాక్ట్స్ ఎంపిక చేసుకుంటే.. మీ ఫోన్‌బుక్‌లో నంబర్ సేవ్ చేసుకున్న వ్యక్తులు తప్ప ఇతరులెవ్వరూ మిమ్మల్ని గ్రూపులో చేర్చడం వీలుకాదు 3. ఇక మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్‌తో.. మీరు నంబర్ సేవ్ చేసుకున్న వారిలోనూ.. ఎవరు మిమ్మల్ని గ్రూపులో చేర్చాలి.. ఎవరు చేర్చకూడదు అనేది నిర్ణయించవచ్చు.

అలాగే… ఒకవేళ మిమ్మల్ని గ్రూపులో చేర్చాలనుకున్న సభ్యుడు.. మీకు పర్సనల్ లింక్ పంపుతారు. దీంతో.. మీరు మీకిష్టమైతే.. ఆ లింక్‌ను ఓపెన్ చేసి గ్రూప్‌ సభ్యుడు కావచ్చు.

కాగా.. ప్రస్తుతం ఐఓఎస్ 2.10.110.20, వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.19.298 బీటీ వెర్షన్ యూజర్లకు మాత్రమే ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అందరి యూజర్లకు ఈ సదుపాయాన్ని తీసుకురానుంది వాట్సాప్.