Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

మన ఇంట్లో యాపిల్ చెట్లను పెంచడం ఎలా..?

How to grow Apple trees, మన ఇంట్లో యాపిల్ చెట్లను పెంచడం ఎలా..?

ఏంటి ఈ మాట వినగానే షాక్ అవుతున్నారా..? నిజంగానే.. యాపిల్ చెట్లను మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా.. ఈ చెట్లు.. ఎక్కువగా.. జమ్మూ కాశ్మీర్.. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎందుకంటే.. అక్కడి శీతల ప్రదేశాల కారణంగా.. నాణ్యమైన యాపిల్స్ లభ్యమవుతాయి. అయితే.. చిన్న చిన్న టెక్నిక్స్‌ని పాటిస్తే.. వాటిని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు.

అలాగే.. బోన్సాయ్ చెట్లుగా వీటిని ఇళ్లలో పెంచుకోవచ్చు. అప్పుడప్పుడు మనం యాపిల్స్ తింటూనే ఉంటాం. అయితే.. అందులోని నల్లటి విత్తనాలను పడేయకుండా.. వాటి ద్వారానే ఈ చెట్లను పెంచుకోవచ్చు. మార్కెట్లో కూడా వీటి విత్తనాలు దొరుకుతాయి. ధర ఎక్కువైనా.. కొంత మంది వీటిని కొనుగోలు చేసి.. యాపిల్ పండ్ల చెట్లను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రింది పద్దతులను జాగ్రత్తగా పాటిస్తే.. మన ఇంటి యాపిల్స్‌ని తినవచ్చు.

How to grow Apple trees, మన ఇంట్లో యాపిల్ చెట్లను పెంచడం ఎలా..?

1. యాపిల్ చెట్లను పెంచడం చాలా ఈజీనే.. కాకపోతే.. ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.
2. ఎర్రగా ఉన్న యాపిల్స్ గింజలైతే.. తొందరగా.. మొలకెత్తే అవకాశం ఉంటుంది.
3. మనం చేతులు తుడుచుకునే టిష్యూని.. లైట్‌గా తడుపుకుని.. యాపిల్ విత్తనాలను ఆ టిష్యూ మీద వేయాలని.. క్లోజ్ చేసి.. సీల్డ్ బాక్స్‌లో కానీ.. డబ్బాలో కానీ వేసి మూత పెట్టాల్సి ఉంటుంది. రెండు రోజులకొకసారి.. వేరే పేపర్ మీద.. ఇదే ప్రకారంగా.. పాత టిష్యూలో ఉన్న విత్తనాలను కొత్త టిష్యూలో వేసుకోవాలి. ఇలా రెండు సార్లు చేసుకోవాలి.
4. ఆ తరువాత వాటిని.. ఓ కుండీలో నాటాలి. ఇంట్లో లేదా.. మార్కెట్‌లో దొరికే వర్మీ కంపోస్టును వేయాలి.
5. ఇలా 15 రోజులకొకసారి లేదా నెల రోజులకొకసారి వాటిని గుల్ల చేస్తూ ఉండాలి.
6. ఈ యాపిల్ చెట్లకు నీళ్లు తక్కువ పోయాలి.
7. అలాగే.. రోజుకు ఒక గంట ఎండలో ఉంచాలి.
8. మామూలు చెట్లలాగే.. వీటికి కూడా.. ఆయిల్, ఎగ్, సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ ఉంటే సరిపోతుంది.
9. అయితే.. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి.. వీటిని పెంచడం కొంచెం సులువే.
కాగా.. వీటిని అత్యంత జాగ్రత్తగా.. శ్రద్ధగా పెంచాల్సి ఉంటుంది. మీరు ఈ చెట్లుకు కాస్త శ్రమను పెడితే.. నాణ్యమైన.. ప్రకృతి సిద్ధమైన యాపిల్స్‌ని తినవచ్చు.

Related Tags