Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

గ్యాస్ట్రిక్ సమస్యకు… అద్భుతమైన వంటింటి చిట్కాలు!

How to Get Rid of Gastric Problem with Home Remedies, గ్యాస్ట్రిక్ సమస్యకు… అద్భుతమైన వంటింటి చిట్కాలు!

గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యకు ముఖ్య కారణమేంటంటే… శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలవుతుంటాయి. ఇవి కడుపులో పేరుకుపోతుంటాయి. ఇవి బయటకు విడుదల కాకపోవడంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య రోజువారీ ఆహార పదార్థాల ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యను వంటింటి చిట్కాలతో కొద్ధి వరకు నయం చేయవచ్చు.

1. తాజా అల్లం :

గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం అనంతరం ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం కూడా గ్యాస్ ఉపశమనానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడుతుంది. అల్లం సహజమైన కార్మినేటివ్ (అపానవాయువు నుండి ఉపశమనం కలిగించే ఏజెంట్లు) గా పనిచేస్తుంది.

2. జీరా వాటర్ (జీలకర్ర నీళ్ళు):

జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం.”జీరా( జీలకర్ర)లో కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి, క్రమంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అదనపు వాయువు ఏర్పడకుండా చేస్తాయి” అని డాక్టర్ సూద్ వివరించారు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. మీ భోజనం పూర్తి చేసిన తర్వాత దానిని చల్లబరచండి, ఆపై వడకట్టి, నీటిని సేవించండి.

3. ఇంగువ (అసఫోటిడా):

అర టీస్పూన్ ఇంగువను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా, గ్యాస్ సమస్యను అరికట్టవచ్చని తెలుస్తుంది. మీ కడుపులో అధిక వాయువును ఉత్పత్తి చేసే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే “యాంటీ ఫ్లాటులెంట్” వలె ఇంగువ పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ‘ఆయుర్వేద గృహ చిట్కాలు’ అనే పుస్తకంలో డాక్టర్ వసంత లాడ్ వాత దోషంలో పెద్దప్రేగు ప్రధాన భూమికను పోషిస్తుందని, మరియు ఇది వాయువుకి సంబంధించిన దోషమని వివరించారు. పెద్దప్రేగులో వాత దోషం పెరిగినప్పుడు, వాయువులు అధికమవుతాయి.

4. వాము (అజ్వైన్):

“వాము లేదా అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది” అని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూద్ వివరించారు. మంచి ఫలితాలను పొందడానికి రోజులో ఒకసారి అర టీస్పూన్ వామును నీటితో కలిపి వేడి చేసి తాగొచ్చు..

5. బేకింగ్ పౌడర్ నిమ్మరసం మిశ్రమం :

1 టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు.

6. త్రిఫల :

మూలికా పొడి అయిన త్రిఫల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. సగం టీస్పూన్ త్రిఫల పొడిని వేడి నీటిలో 5 నుండి 10 నిమిషాలు ఉంచి, పడుకునే ముందుగా ఈ ద్రావణాన్ని సేవించాలి. ఈ మిశ్రమంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోండి. అధికంగా తీసుకున్న పక్షంలో ఉబ్బరానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి.

వాస్తవానికి, అపానవాయువు అనేది ఒక సాధారణమైన పరిస్థితి మరియు ఈ సమస్యను ఎదుర్కోని వారు ఉండరు. కానీ సమస్య తగ్గకుండా ఎక్కువవుతుంటే, ఇది లాక్టోస్ టోలరెన్స్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఒక రకమైన ప్రేగు సంబంధిత తీవ్రమైన సమస్యలకు సంకేతంగా మారుతుంది. తరచుగా మాత్రల మీద ఆధారపడడం కన్నా, వీలైనంతవరకు సహజసిద్దమైన పరిష్కార మార్గాలను ఆశ్రయించడం ఎప్పుడూ కూడా మంచిదే. ఇవన్నీ చేసినతర్వాత కూడా సమస్య అదుపులోకి రాని పక్షంలో ఖచ్చితంగా వైద్యుడ్ని సంప్రదించాల్సిందే.

Related Tags