ఆధార్‌ కార్డు వున్న వారికి గుడ్‌ న్యూస్: కొత్త సౌకర్యం

How to book online appointment for Aadhaar address and mobile number change, ఆధార్‌ కార్డు వున్న వారికి గుడ్‌ న్యూస్: కొత్త సౌకర్యం

ఆధార్‌కార్డులో ఏదైనా తప్పుగా.. ఉందా..? వాటిని మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే.. ఏ బ్యాంక్ ముందో.. లేక పోస్ట్ ఆఫీస్ ముందో.. లేక మీసేవ ముందో.. క్యూ లైన్‌లో నుంచోవాల్సి వస్తుంది. కానీ.. పని అవుతుందో లేదో గ్యారెంటీ లేదు. అలాగే.. అప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం.. ఆధార్ కార్డ్ కంపెల్సరీ.. అంటూ.. తీసుకొచ్చింది. దీంతో.. ఇప్పుడు దేనికైనా.. ఆధార్ కార్డు కావాలని షరతు పెడుతున్నారు. అందులో.. పొల్లు పోయినా.. మార్చాల్సిందే అంటూ.. ముప్పతిప్పులు పెడుతున్నారు. దీంతో.. టెన్షన్స్ తప్పడంలేదు.

ఇప్పుడు అలాంటి టెన్షన్స్‌కి చెక్ పెడుతూ.. యూఐడీఏఐ అంటే.. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ తాజాగా ఆన్‌లైన్ బుకింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే.. ఏడు పట్టణాల్లో ఆధార్ సంస్థలను తీసుకొచ్చాయి. అవి.. పాస్‌పోర్ట్ ఆఫీల మాదిరిగా ఉంటాయి. అక్కడ మనకు సంబంధించిన అన్ని ఫ్రూఫులతో.. మా పేర్లు.. అడ్రస్‌లను మార్చుకోవచ్చు.

ఢిల్లీ, బోపాల్, ఆగ్రా, చెన్నై, చంఢీగఢ్, హిసర్, విజయవాడ వంటి పలు ప్రాంతాల్లో యూఐడీఏఐ కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి లైన్లలో అక్కడ ఇక్కడా.. నుంచునే శ్రమ తగ్గింది. డైరెక్ట్ ఆధార్ కార్డ్ ఆఫీస్‌కు వెళ్లి పని చేసుకోవచ్చు. కాగా.. ఈ ఆధార్ సంస్థలు వారంలో ఏడు రోజులు పనిచేస్తాయి. మంగళవారం సెలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *