Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?

how soliga tribals elephants and a dog found elusive tiger, రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?

జంతువులతో బాటు మనుషుల రక్తం రుచి మరిగిన పెద్ద పులిని పట్టడానికి అటవీ అధికారులు అతి పెద్ద ప్రయత్నమే చేశారు. ఆరు రోజులు ముప్పు తిప్పలు పెట్టిన ఈ పులి ఎట్టకేలకు పట్టుబడింది. అది కర్నాటకలోని బండిపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇలా కనబడి.. అలా దాడి చేసి ఇట్టే మాయమయ్యే ఈ క్రూర జంతువు ఇద్దరు గ్రామస్థులను చంపి తిన్నదట. మరో 18 పశువులు కూడా దానికి ఆహారంగా మారిపోయాయి. దీన్ని పట్టి బంధించడానికి అటవీ అధికారులు ‘ చుక్కలు చూడాల్సి వచ్చింది ‘. బెంగుళూరుకు సుమారు 200 కి. మీ. దూరంలోని ఈ ఫారెస్ట్ రేంజిలో గల నాగువనహళ్లి గ్రామమది.. తమకు కంటి నిద్ర లేకుండా చేస్తున్న ఈ పులిని ఎలాగైనా చంపి తీరాలన్నదే ఆ గ్రామస్థుల అభిమతం. ఇక–వందమంది అటవీ అధికారులు పెద్ద వ్యూహమే పన్నారు. వీరు ఆ ప్రాంతంలోని సోలిగ జాతి గిరిజనుల సహకారం తీసుకోవడమే కాదు.. ఆరు ఏనుగులను, ప్రత్యేక శిక్షణ పొందిన జర్మన్ షెఫర్డ్ కుక్కను కూడా తమ వెంట తీసుకువెళ్లిఅతి పెద్దదైన అటవీ ప్రాంతంలో ఆ పులి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. కానీ దాని జాడ కనుక్కోవడం వారికి అంత సులభం కాలేదు. ఆ పులిని పట్టడం కాదు.. దాన్ని చంపి తీరాలన్న గ్రామస్థులు. వారి ప్రయత్నానికి అడ్డు తగలడంతో అధికారులకు అది ఓ పెద్ద సవాలుగా మారింది. కానీ.. వారు వెనుకంజ వేయకుండా గిరిజనుల సాయంతో అడవిలో అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయించారు. వారి భగీరథ ప్రయత్నంతో ఈ పులి ఆచూకీ ఈ నెల 12 న తెల్లవారు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో ఓ పొదల్లో కనిపించింది. మూడు ఏనుగులు, శునకం దాన్ని చుట్టుముడుతుండగా అది తప్పించుకుని మరో పొదలో దూరింది. అయితే అధికారులు సుమారు గంటపాటు కష్టపడి ట్రాంక్వి లైజర్ సాయంతో అది స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ పెద్దపులిని అతి పెద్ద వలతో బంధించి మైసూరు జూకు తరలించారు. ఇన్నాళ్లుగా తమను హడలెత్తిస్తున్న ఈ క్రూర జంతువు పట్టుబడడంతో గ్రామస్థులతో బాటు అటవీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.how soliga tribals elephants and a dog found elusive tiger, రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ? how soliga tribals elephants and a dog found elusive tiger, రక్తం రుచి మరిగిన పులిని ఎలా పట్టారంటే.. ?

Related Tags