పోలవరం రీటెండర్‌తో.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం..!

పోలవరం ప్రధాన ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరింది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువ శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థ. ఈ ప్రాజెక్ట్‌లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ […]

పోలవరం రీటెండర్‌తో.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం..!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 4:47 PM

పోలవరం ప్రధాన ప్రాజెక్ట్‌ రీటెండరింగ్‌తో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరింది. ప్రధాన ప్రాజెక్ట్ రీ టెండరింగ్‌తో రూ.628 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యాయి. గతంలో కంటే 12.6 శాతం తక్కువకు పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది.

గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువ శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చిన మేఘా సంస్థ. ఈ ప్రాజెక్ట్‌లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా.. ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్న మేఘా సంస్థ.

రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌లో భాగంగా పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి తిరిగి టెండర్‌ను పిలిచింది. దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండర్‌కు వెళ్లి, పోలవరం హెడ్‌వర్స్క్‌తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఆ పనుల విలు రూ.4987 కోట్లు. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే బిట్ దాఖలు చేసింది.

ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద‌దైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా నిర్మించిన మేఘా సంస్థ. పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం.. అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మేఘా సంస్థ ఉంది.