నవ్వు నాలుగు విధాల మేలు!

, నవ్వు నాలుగు విధాల మేలు!

నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం అన్నారు ఆనాటి మహానుభావులు. నవ్వు నాలుగు విధాల చేటు అని మన పెద్దవాళ్లు అంటుంటే.. ఇప్పటి తరం మాత్రం నవ్వు నాలుగు విధాల మేలు అంటున్నారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆందోళన, ఒత్తిళ్లు లేకుండా ఏ పనీ జరగదు. వీటిని తగ్గించుకునే మార్గం నవ్వు ఒక్కటే.

  • ఫేషియల్, ఎక్సర్‌సైజ్ కంటే నవ్వు బాగా పనిచేస్తుంది. నవ్వడం వల్ల ముఖం మీది ఉన్న కండరాలు కదిలి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
  • అధిక రక్తపోటు చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు వేధిస్తుంది. గుండెపై అత్యంత ప్రభావం చూపే అధిక రక్తపోటు హార్ట్ పనితీరును నెమ్మది చేస్తుంది. అందుకే నవ్వుతో బీపిని కంట్రోల్ చేసుకోవచ్చు.
  • రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు అమలు పరుస్తుంటాం కదా. అందుకు వాడే మందుల కంటే నువ్వు అనే మందును తీసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. దీంతో ఇన్ఫెక్షన్లు, ఆత్రుత, కోపం ఇవన్నీ తగ్గిపోతాయట.
  • ఒత్తిడితో, నిద్రలేమితో గడుపుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువగా కనబడుతుంది. నిద్రపోయే ముందు కాసేపు నవ్వుకొని పడుకుంటే.. మనసు ప్రశాంతంగా ఉండి వెంటనే నిద్ర పడుతుంది.
  • శరీరంలో నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రతికూల ఆలోచనలకు పునాది వేస్తుంది. అందుకే సానుకూల ఆలోచనలు మనస్సులో మెదలాలంటే అందుకు మంచి రెమెడీ నవ్వు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల ఆలోచనా సరళి సానుకూలంగా స్సందిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *