లాక్ డౌన్… ఇండియన్ కౌన్సిల్ ఏం చెబుతుందో ?

ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అన్న దానిపై కేంద్రం ఇంకా తర్జన భర్జన పడుతోంది. దశలవారీగా ఎత్తివేసిన పక్షంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించిపోయాయని, మళ్ళీ ఈ వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా వ్యూహాన్ని రూపొందించి డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 […]

లాక్ డౌన్... ఇండియన్ కౌన్సిల్ ఏం చెబుతుందో ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 08, 2020 | 4:07 PM

ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అన్న దానిపై కేంద్రం ఇంకా తర్జన భర్జన పడుతోంది. దశలవారీగా ఎత్తివేసిన పక్షంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించిపోయాయని, మళ్ళీ ఈ వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా వ్యూహాన్ని రూపొందించి డాక్యుమెంట్ తయారు చేయాలని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 బృందాలు.. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్,నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అందించే డేటాను బట్టి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్ఛు .

మొదట దేశాన్ని మూడు జోన్లుగా విభజించాలని ఈ బృందాలు సూచించినట్టు తెలిసింది. కరోనా ప్రభావాన్ని బట్టి..ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగు జోన్లుగా వేర్వేరు చేయాలనీ, ఆకుపచ్చ జోన్ గా పరిగణించిన ప్రాంతాల్లో వెంటనే ఆర్ధిక కార్యకలాపాలను ప్రారంభించవచ్చునని, పసుపు పచ్చ రంగు జోన్లలో కేవలం ఆర్ధిక, పారిశ్రామిక ఉత్పాదన కార్యకలాపాలను పరిమితంగా చేపట్టాలని, రెడ్ జోన్ ఏరియాల్లో లాక్ డౌన్ ను పొడిగించాలని ఈ టీమ్ లు అభిప్రాయపడినట్టు చెబుతున్నారు.  హాట్ స్పాట్ లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని  కూడా ఈ బృందాలు సిఫారసు చేశాయట.