చేతి వేళ్లను బట్టి గుండె జబ్బు ఉందో లేదో చెప్పేయొచ్చట

చేతి వేళ్లను బట్టి కూడా గుండె జబ్బు ఉందో లేదో చెప్పేయొచ్చని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతమున్న కాలంలో హార్ట్ ఎటాక్‌ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ప్రస్తుతం అందరికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి..

చేతి వేళ్లను బట్టి గుండె జబ్బు ఉందో లేదో చెప్పేయొచ్చట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 15, 2020 | 3:59 PM

చేతి వేళ్లను బట్టి కూడా గుండె జబ్బు ఉందో లేదో చెప్పేయొచ్చని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతమున్న కాలంలో హార్ట్ ఎటాక్‌ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ప్రస్తుతం అందరికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటివి పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి.

అయితే తాజాగా గుండె పోటు వచ్చిన వారిపై పరిశోధన చేసిన నిపుణులు.. ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. చేతి వేళ్లను బట్టి కూడా గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. గుండెపోటుతో మరణించిన 200 మందిపై పరిశీలించిన వారందరిలో ఎక్కువ శాతం ఒక కామన్ విషయం ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సాధారణంగా చేతికి ఉన్న అన్ని వేళల్లో మధ్య వేలు పెద్దగా ఉంటుంది. ఆ తర్వాత ఉంగరపు వేలు పెద్దగా ఉండి, ఆ తర్వాత చూపుడు వేలు పెద్దగా ఉంటుంది. కానీ కొందరిలో ఈ మూడు వేళ్లు సమానం ఉండటం లేదా ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు పెద్దగా ఉండటం జరుగుతుంది. ఇలా ఉన్నవారిలో ఖచ్చితంగా 80 నుంచి 90 శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.

అయితే ఇలా వేళ్లు సరిగ్గా లేనంత మాత్రాన గుండె జబ్బులు వస్తాయని కాదు.. ఉన్నంత మాత్రాన హార్ట్ ఎటాక్ రాదని కాదు. ఎక్కవ శాతం మందికి ఇలా జరిగిందని నిపుణులు వెల్లడించారు. ఏదేమైనా ఉన్నంతలో జాగ్రత్తగా ఉండటం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని వారు స్పష్టం చేశారు.

Read More:

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్..

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!