లాక్‌డౌన్ ఎఫెక్ట్.. అబార్షన్‌కు నోచుకోలేకపోయిన 1.85 మిలియన్ల మంది మహిళలు

కోవిడ్-19 క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దాదాపు 1.85 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావం సేవలు అందుకోలేకపోయారని ఓ అధ్య‌య‌నం తెలిపింది.

లాక్‌డౌన్  ఎఫెక్ట్..  అబార్షన్‌కు నోచుకోలేకపోయిన 1.85 మిలియన్ల మంది మహిళలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 4:04 PM

కోవిడ్-19 క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా దాదాపు 1.85 మిలియన్ల మంది మహిళలు గర్భస్రావం సేవలు అందుకోలేకపోయారని ఓ అధ్య‌య‌నం తెలిపింది. ఆస్పత్రులు అన్నీ క‌రోనా రోగుల‌తో నిండిపోవ‌డంతో పాటు, ఎమ‌ర్జెన్సీ సేవ‌లు మిన‌హా మిగ‌తా ఆరోగ్య స‌మ‌స్య‌లకు కొన్ని ఆస్పత్రుల‌లో అసలు వైద్యం చేయ‌లేదు. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌మెంట్, ప్రైవేటు ఆసుపత్రులు, కెమిస్ట్ అవుట్‌లెట్లలో అబార్షన్‌ను నిరాకరించినట్టు స‌ద‌రు నివేదిక వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో వ‌ర్క్ చేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఐపాస్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఐడీఎఫ్) చేసిన సర్వేలో‌ ఈ విషయం వెల్లడైంది.

లాక్‌డౌన్ ఫ‌స్ట్, సెంక‌డ్ ఫేజ్ ల‌లో అంటే మార్చి 25 నుంచి మే 3 మ‌ధ్య‌కాలంలో వివిధ కార‌ణాల వల్ల‌ 59 శాతం మంది మహిళలు అబార్షన్ చేయించుకోవాలనుకున్నారని, కానీ ఆ సేవలు పొందలేకపోయారని స‌ర్వేలో వెల్లడైంది. తాజాగా ఆంక్షలు సడలిస్తుండడంతో పరిస్థితిలో వస్తుందని, ఐడీఎఫ్ సీఈవో వినోజ్ మేనింగ్ తెలిపారు. నివేదిక ప్రకారం, 1.85 మిలియన్ల క్యాన్సిల్ చేసుకున్న‌ గర్భస్రావాల‌లో, 1.5 మిలియన్ మంది (80 శాతం) మెడిసిన్ అమ్మకం తగ్గడం వల్ల రాజీప‌డ్డార‌ని తేలింది. మిగిలిన 20 శాతం మంది ప్ర‌వేట్, ప‌బ్లిక్ హెల్త్ కేర్ స‌ర్సీసెస్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో గ‌ర్భాన్ని కంటిన్యూ చేశార‌ని స‌ర్వే సారాంశం. లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించ‌డం కూడా ఇందుకు కొంతమేర కార‌ణ‌మైంది.

చాలా వరకు గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిటల్స్, వారి సిబ్బంది ఫోక‌స్ అంతా కోవిడ్-19 ట్రీట్మెంట్ పైనే ఉందని, ప్రైవేటు ఆస్ప‌త్రులు కొన్ని క‌రోనా కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో సురక్షిత గర్భస్రావాలకు వీలు కుద‌ర‌లేద‌ని వినోజ్ పేర్కొన్నారు. గర్భస్రావం అనేది ప్ర‌ధానంగా సమయంపై ఆధారపడి ఉంటుందని వివ‌రించారు.