‘ స్కామ్ స్టర్ దాదా ‘ ఫ్లాష్ బ్యాక్ ! తెలుసుకోవాల్సిందే !

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ అనంతరావ్ పవార్ ను ఆయన మద్దతుదారులు, సన్నిహితులంతా సినిమాల్లో మాదిరిగా ‘ ఆప్యాయం’ గా ‘ దాదా ‘ అని పిలుచుకుంటారు. ఆయన తండ్రి అనంతరావ్ పవార్.. .. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు స్వయానా అన్న. ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు వి.శాంతారాంతో కలిసి అనంతరావ్ కూడా పని చేశారట. అయితే అజిత్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచే బదులు.. తన అంకుల్ శరద్ పవార్ బాటలో […]

' స్కామ్ స్టర్ దాదా ' ఫ్లాష్ బ్యాక్ ! తెలుసుకోవాల్సిందే !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 4:01 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ అనంతరావ్ పవార్ ను ఆయన మద్దతుదారులు, సన్నిహితులంతా సినిమాల్లో మాదిరిగా ‘ ఆప్యాయం’ గా ‘ దాదా ‘ అని పిలుచుకుంటారు. ఆయన తండ్రి అనంతరావ్ పవార్.. .. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు స్వయానా అన్న. ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు వి.శాంతారాంతో కలిసి అనంతరావ్ కూడా పని చేశారట. అయితే అజిత్ తన తండ్రి అడుగుజాడల్లో నడిచే బదులు.. తన అంకుల్ శరద్ పవార్ బాటలో నడిచారు. ఆయన రెండోసారి తన రాజకీయ జీవితంలో డిప్యూటీ సీఎం అయ్యారు. శరద్ పవార్ నాడు మహారాష్ట్ర సీఎంగా.. .. కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తే. జూనియర్ పవార్ (అజిత్) మాత్రం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. 60 ఏళ్ళ అజిత్.. బారామతి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈడీ దర్యాప్తు చేసిన మనీ లాండరింగ్ కేసులో తన పేరు కూడా బయటకు రావడంతో గత సెప్టెంబరులో ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. (శరద్ పవార్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వఛ్చిన సంగతి తెలిసిందే). 25 వేల కోట్ల మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ లో వీరి ప్రమేయం ఉన్నట్టు ఈడీ నాడు పేర్కొంది. 2010 డిసెంబరులో అప్పటి ఛగన్ భుజ్ బల్ స్థానే అజిత్ డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రంలో సహకార చక్కెర మిల్లుల లావాదేవీల్లో శరద్ పవార్ తో బాటు ఈయన కూడా ‘ ఏకఛత్రాధిపత్యం ‘ వహించాడు. 1999 లో సోనియా విదేశీ పౌరసత్వ సమస్య నేపథ్యంలో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి..ఎన్సీపీని స్థాపించారు. అప్పుడు అజిత్ ఆయన వెంటే ఉన్నారు. అదే సంవత్సరంలో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడడం, పలు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్,… ఎన్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో… విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రభుత్వంలో అజిత్ పవార్ మంత్రి పదవులు అనుభవించారు. ఇరిగేషన్ మంత్రిగా సుమారు పదేళ్లు కొనసాగినప్పుడు.. పాతికవేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే సామాజిక మాధ్యమాల్లో అజిత్ పవార్ కు మంచి ‘ పాపులారిటీ ‘ ఉంది. ఆయనకు దాదాపు 3.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్టు అంచనా.

.