శ్రావణ సందడి : కిటకిటలాడుతున్న మార్కెట్లు

ప్రధాన నగరాల్లోని మార్కెట్లు సందడిగా మారాయి. ప్రధాన మార్కెట్లు, రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. పూజా సామాగ్రి కొనుగోలు కోసం మహిళలు...

శ్రావణ సందడి : కిటకిటలాడుతున్న మార్కెట్లు
Follow us

|

Updated on: Jul 30, 2020 | 6:20 PM

శ్రావణమాసం రెండో శుక్రవారం… వరలక్ష్మి వ్రతం కోసం తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విశాఖ, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లోని మార్కెట్లు సందడిగా మారాయి. ప్రధాన మార్కెట్లు, రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి. పూజా సామాగ్రి కొనుగోలు కోసం మహిళలు బయటకు వచ్చారు.

శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో నగరాల్లోని పలు మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకోడానికి పట్టణ వాసులతోపాటు, గ్రామీణ మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహిళలు గురువారం ఉదయం నుంచి మార్కెట్లకు వచ్చి పూజకు కావాల్సిన సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. పూజా సామాగ్రితోపాటు బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు మహిళలతో నిండిపోయాయి.