Breaking News
  • డా.వసంత్‌కు డీఎంహెచ్‌వోలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు. గాంధీలో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ వసంత్‌. తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హెల్త్‌ డైరెక్టర్‌ను కలిసిన వసంత్‌.
  • మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ. మంత్రి మల్లారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు. తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడంలేదని ఆవేదన. మంత్రి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి.
  • రేపు ఢిల్లీకి టీడీపీ ఎమ్మెల్సీలు. మండలిని రద్దు చేయొద్దంటూ ఢిల్లీ పెద్దలను కలవనున్న ఎమ్మెల్సీలు. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎమ్మెల్సీలు. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న టీడీపీ బృందం.
  • సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌.
  • బెంగాల్‌ సర్కార్ సంచలన నిర్ణయం. ఎన్నికల వ్యూహకర్త పీకేకు జెడ్‌కేటగిరీ భద్రత. తృణమూల్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్న పీకే.
  • అనంతపురం: ఏసీబీ అధికారి అవతారం ఎత్తిన కేటుగాడు. ఏసీబీ అధికారి నుంటూ పలువురు నుంచి భారీగా వసూళ్లు. ఇప్పటి వరకు పలువురు అధికారుల నుంచి రూ.27 లక్షలు వసూలు. చివరకు పోలీసులకు చిక్కిన కేటుగాడు జయకృష్ణ. రూ.2.91 లక్షలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం.

ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..?

jagan met primeminister modi, ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చలు జరిపారు.  ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధాన మంత్రికి వివరించి.. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని అభ్యర్థించారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం.

ఈ నెల 15నుంచి శ్రీకారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి మోదీ సానుకూలంగా స్పందించారని సమాచారం.  వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని భావించిన ముఖ్యమంత్రి జగన్.. ఆయనను సగౌరవంగా ఆహ్వానం అందించారని, దానికి మోదీ సానుకూలంగా స్పందించారని ఏపీ సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.