లాక్ డౌన్ ఎఫెక్ట్.. కరోనా తగ్గుముఖం !

గత 15 రోజుల్లో దేశంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు 170 నుంచి 129 కి తగ్గినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇదే కాలంలో ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించిన జిల్లాల సంఖ్య 207 నుంచి 297 కు పెరిగినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 15 న కేంద్రం ఆయా జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించింది. ఆ రోజున ప్రభుత్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్ స్పాట్ జిల్లాలుగా […]

లాక్ డౌన్ ఎఫెక్ట్.. కరోనా తగ్గుముఖం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 29, 2020 | 6:31 PM

గత 15 రోజుల్లో దేశంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు 170 నుంచి 129 కి తగ్గినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఇదే కాలంలో ఆరెంజ్ జోన్లుగా వర్గీకరించిన జిల్లాల సంఖ్య 207 నుంచి 297 కు పెరిగినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 15 న కేంద్రం ఆయా జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించింది. ఆ రోజున ప్రభుత్వం 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 170 జిల్లాలను కరోనా వైరస్ హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజుల్లో 80 జిల్లాల్లో ఏ కొత్త కేసూ నమోదు కాలేదని, అలాగే 14 రోజుల్లో 47 జిల్లాల్లో ఒక్క ఫ్రెష్ కేసుకూడా నమోదు కాలేదని చెప్పారు. తొమ్మిది రాష్ట్రాల్లోని పదిహేను జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, వీటిలో తెలంగాణాలో హైదరాబాద్, ఏపీలో కర్నూలు జిల్లాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. లాక్ డౌన్ ని రెండో సారి కూడా పొడిగించిన ఫలితంగానే కరోనా కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.