సోమాలియాలో మారణహోమం

సోమాలియాలో శుక్రవారం అర్ధరాత్రి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై బాంబులు విసురుతూ విధ్వంసం సృష్టించారు. ఈ దారుణ ఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా స్ధానిక అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్‌పై కాల్పులకు తెగబడ్డ అనంతరం కారుబాంబును పేల్చేశారు. సోమాలియాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పలువురు స్ధానిక రాజకీయ నేతలు ఆ హోటల్లో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే వీరిని  టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా […]

సోమాలియాలో మారణహోమం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2019 | 3:14 PM

సోమాలియాలో శుక్రవారం అర్ధరాత్రి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై బాంబులు విసురుతూ విధ్వంసం సృష్టించారు. ఈ దారుణ ఘటనలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా స్ధానిక అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమాలియా పోర్టు సిటీ కిస్మాయోలోని అసాసే హోటల్‌పై కాల్పులకు తెగబడ్డ అనంతరం కారుబాంబును పేల్చేశారు.

సోమాలియాలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పలువురు స్ధానిక రాజకీయ నేతలు ఆ హోటల్లో సమావేశమైనట్టు తెలుస్తోంది. అయితే వీరిని  టార్గెట్ చేసుకుని ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ హోటల్లో ఉన్న సామన్య పౌరులు, హోటల్ సిబ్బంది సహా ఇద్దరు జర్నలిస్టులు సైతం అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.  ఇదిలా ఉంటే  ఈ దాడులకు పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్ధ ప్రకటించింది.