Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • సిద్దిపేట: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసిఆర్ నేడు ప్రారంబించనున్నారు .. కార్యక్రమానికి హాజరుకానున్న చిన జీయర్ స్వామి..
  • నేడు మరో రెండు పిటిషన్లపై విచారణ.. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు విచారణ.. ఇప్పటికే 49 మంది కి నోటీసులు ఇచ్చిన హైకోర్టు.. ఎల్జి పాలిమర్స్ కేసును విచారించిన ధర్మాసనం.
  • మహారాష్ట్ర లో కరోనా విలయతాండవం. మహారాష్ట్ర లో ఈరోజు 2598 కరోనా పాజిటివ్ కేస్ లు,85 మంది మృతి. మహారాష్ట్ర రాష్ట్రంలో 59546 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. 1982 మంది మృతి.
  • అమరావతి: ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పు. ఏపీ ప్రభుత్వానికి SEC విషయంలో హైకోర్టు షాక్. SECగా నిమ్మగడ్డ ను విధుల్లోకి తీసుకోవాలన్న ఏపీ హైకోర్టు. నిమ్మగడ్డ తొలగింపు ఆర్డినెన్స్ కొట్టేసిన ఏపీ హైకోర్టు. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసువాలని తీర్పు ఇచ్చిన హైకోర్టు.
  • అచ్చెన్నాయుడు, టీడీఎల్పీ ఉప నేత. నిమ్మగడ్డ రమేశ్ ను ఈసీ గా కొనదగించాలని. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇప్పటికయినా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఈ సమయంలో కక్ష సాధింపు రాజకీయాలా.

వారియర్స్ కే ఫస్ట్ డోస్.. కరోనా వ్యాక్సిన్ పై జాన్సన్ అండ్ జాన్సన్ క్లారిటీ..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది.కరోనా వ్యాక్సిన్‌ కోసం ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది.
Hospital workers to be first up for Johnson & Johnson vaccine, వారియర్స్ కే ఫస్ట్ డోస్.. కరోనా వ్యాక్సిన్ పై జాన్సన్ అండ్ జాన్సన్ క్లారిటీ..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ కోసం ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కంపెనీతో అమెరికా భారీ డీల్‌ కుదుర్చుకుంది. దీని విలువ రూ.3,438 కోట్లు. దీనికి సంబంధించిన ఒప్పందంపై అమెరికా ప్రభుత్వానికి చెందిన బయోమెడికల్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(బార్డా), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా 2021 మార్చిలోగా 100 కోట్ల డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సమకూర్చనుంది.

కాగా.. జాన్సన్ & జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్‌ను అందిస్తుందని, ఇది వైద్య కార్మికులకు, ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ కార్మికులు, నర్సులు, వైద్యులు, రోగులతో పనిచేసే వారికి మొదట అందుబాటులో ఉంటుందని చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టోఫెల్స్ తెలిపారు. ధర విషయానికొస్తే, ఇది సాధ్యమైనంత తక్కువగా ఉంటుందని మరియు జాన్సన్ & జాన్సన్ ఈ టీకాను లాభాపేక్షలేని ప్రాజెక్టుగా భావిస్తున్నారని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము పరీక్షిస్తున్న ఒక ‘లీడ్‌ క్యాండిడేట్‌ వ్యాక్సిన్‌’ అత్యుత్తమ ఫలితాలను అందిస్తోందని సంస్థ వెల్లడించింది.

Related Tags