‘తలా’ ధోని నెక్ట్స్ ఐపీఎల్‌లో ఆడతాడా?

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ 12వ సీజన్‌ ముగిసింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు కప్‌ను ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి బాల్‌ వద్ద బోల్తా పడింది. దీంతో టైటిల్‌ కోసం పోరాడిన ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రికెట్‌ అభిమానులందరిలోనూ ఇప్పుడు ఒకే ప్రశ్న వెంటాడుతుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే […]

'తలా' ధోని నెక్ట్స్ ఐపీఎల్‌లో ఆడతాడా?
Follow us

|

Updated on: May 13, 2019 | 3:37 PM

హైదరాబాద్‌ : ఐపీఎల్‌ 12వ సీజన్‌ ముగిసింది. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు కప్‌ను ఎగరేసుకుపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి బాల్‌ వద్ద బోల్తా పడింది. దీంతో టైటిల్‌ కోసం పోరాడిన ఆ జట్టు ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రికెట్‌ అభిమానులందరిలోనూ ఇప్పుడు ఒకే ప్రశ్న వెంటాడుతుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడతాడా..? లేదా..? అని. అయితే, దీనిపై మ్యాచ్ అనంతరం ధోనీ స్పందించాడు. హోప్‌పుల్లీ, యస్ అంటూ జెర్సీ నెంబర్ 7 ను అభిమానించే వారి గుండెల్లో కొత్త ఆశలు నింపాడు.

‘దేశం కోసం 2019 ప్రపంచకప్‌ గెలవడానికి కృషి చేయడమే నా బాధ్యత. చెన్నై జట్టు తరఫున ఈ సీజన్‌లోనూ మంచి క్రికెట్‌ ఆడాం. జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నీ సహకరిస్తే మళ్లీ వచ్చే ఐపీఎల్‌ ఆడతానని అనుకుంటున్నాను’ అని ధోనీ చెప్పాడు. కాగా ఈ ఐపీఎల్‌లో ధోని దుమ్ము రేపాడు. 15 మ్యాచుల్లో 83.20సగటుతో 416 పరుగులు చేశాడు. తనపై చేస్తున్న విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.