ప్రేమిస్తే.. చంపేస్తారా.? ప్రాణం కంటే పరువే ముఖ్యమా?

Honor Killing Deaths: ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ ఎప్పుడు.? ఎలా.? పుడుతుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. అందులో కులాంతర, మతాంతర వివాహాలు కూడా ఉంటున్నాయి. అయితే తమ మాటలను పట్టించుకోకుండా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని కొంతమంది పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారి ఆగ్రహానికి కులం, వంశ ప్రతిష్ట అనే రెండు భావనలు ఆజ్యం పోస్తున్నాయి. అయినవారిని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా హత్య చేస్తున్నారు. తాజాగా […]

ప్రేమిస్తే.. చంపేస్తారా.? ప్రాణం కంటే పరువే ముఖ్యమా?
Follow us

|

Updated on: Sep 26, 2020 | 3:15 PM

Honor Killing Deaths: ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ ఎప్పుడు.? ఎలా.? పుడుతుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎన్నో జరుగుతున్నాయి. అందులో కులాంతర, మతాంతర వివాహాలు కూడా ఉంటున్నాయి. అయితే తమ మాటలను పట్టించుకోకుండా కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని కొంతమంది పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారి ఆగ్రహానికి కులం, వంశ ప్రతిష్ట అనే రెండు భావనలు ఆజ్యం పోస్తున్నాయి. అయినవారిని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా హత్య చేస్తున్నారు. తాజాగా హేమంత్ హత్యోదంతమే ఇందుకు నిదర్శనం. ఇదొక్కటే కాదు ఇలాంటి పరువు హత్యలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ప్రణయ్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. (సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..)

గతంలో నగరంలో చోటు చేసుకున్న ఘటనలు ఇవే..

తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వకుండా.. కులాంతర వివాహం చేసుకున్న విజయలక్ష్మీ అనే మహిళను రెండేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి.. గర్భిణీ అని చూడకుండా దారుణంగా హతమార్చడం సంచలనం రేపిన విషయం విదితమే. అలాగే జూన్ 2017లో వేరే కులపు అమ్మాయిని ప్రేమించాడని శంషాబాద్‌కు చెందిన పరమేశ్వర్ రెడ్డిని అతడి తండ్రి, సోదరుడు బండరాయితో కొట్టి చంపేశారు. దాన్ని సూసైడ్‌గా చిత్రీకరించాలని ప్రయత్నించినా.. చివరికి అసలు నిజం బయటికి వచ్చింది.  (కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!)

2017 సెప్టెంబర్‌లో ‌వనస్థలిపురంకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లలిత్‌ ఆదిత్యను కులాంతర వివాహం చేసుకున్నాడని అతడి బావమరిది, మరో ఇద్దరు కలిసి దారుణంగా చంపేశారు. ఇక 2018 మేలో సతీష్ అనే యువకుడిని గోల్నాకలో అతడి భార్య ముందే ఆమె సోదరుడు, చిన్నాన్న హత్య చేశారు. ఆ ఇద్దరి ప్రేమ వివాహం వారికి నచ్చకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. (ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..)

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..