ఎయిరిండియా విమానాలకు హాంకాంగ్ బ్రేక్

ఎయిరిండియా విమానాలను ఈ మాసాంతం వరకు హాంకాంగ్ లో అనుమతించబోరు. పైగా ఇండియా నుంచి వచ్ఛే విమాన ప్రయాణికుల వద్ద కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని,..

ఎయిరిండియా విమానాలకు హాంకాంగ్ బ్రేక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 3:41 PM

ఎయిరిండియా విమానాలను ఈ మాసాంతం వరకు హాంకాంగ్ లో అనుమతించబోరు. పైగా ఇండియా నుంచి వచ్ఛే విమాన ప్రయాణికుల వద్ద కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణానికి 72 గంటల ముందు టెస్ట్ చేయించుకుని ఉండాలని హాంకాంగ్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఇండియా నుంచి ఈ నగరానికి వచ్చిన కొందరు ప్రయాణికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎయిరిండియా విమానాలపై ఈ తాత్కాలిక బ్యాన్ విధించారు. అలాగే ఈ నగర విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులంతా తమ ప్రయాణ అనంతర కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్న రూల్ కూడా పెట్టారు. కాగా ఎయిరిండియా ఈ కొత్త నిబంధనలపై ఇంకా స్పందించలేదు.

ఇండియాతో బాటు బంగ్లాదేశ్ , ఇండోనేసియా, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్ఛే విమాన ప్రయాణికులంతా హాంకాంగ్ ఎయిర్ పోర్ట్ వద్ద టెస్టులు చేయించుకోవలసిందే.