Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

అట్టుడుకుతున్న హాంకాంగ్.. రెండో రోజు విమానాలు రద్దు

Hong Kong's airport shut down after thousands protests, అట్టుడుకుతున్న హాంకాంగ్.. రెండో రోజు విమానాలు రద్దు

హాంకాంగ్ అట్టుడుకుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుపై చైనా జోక్యాన్ని నిరసిస్తూ ప్రొడెమోక్రసీ సభ్యులు చేస్తున్న ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వేలాదిమంది ఆందోళనకారులు హాంకాంగ్ సురక్షితం కాదంటూ ప్లకార్డులు పట్టుకుని హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకెళ్లారు. వీరంతా ఒక్కసారిగా ప్రవేశించడంతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.

ఏకంగా సోమవారం విమాన సేవలు రద్దయిపోయాయి. ఇదే పరిస్థితి మంగళవారం కూడా కొనసాగడంతో సౌకర్యాలు కల్పించలేక అధికారులు చేతులెత్తేశారు. ఆందోళన కారులతో నిండిపోయిన హాంకాంగ్ విమానాశ్రయం నుంచి ప్రయాణికులు బయటకు వెళ్లిపోవాల్సిందిగా విమానాశ్రయ అధికారులు విఙ్ఞప్తి చేశారు. నిరసనలతో హోరెత్తిన విమానాశ్రయంలో ఏ పని సాగని పరిస్థితి నెలకొంది. ఇతర దేశాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దుకావడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related Tags