శవయాత్రలో తేనెటీగల దాడి.. ఒకరి మృతి

మరణం ఎలా వెంటాడుతుందో ఎవ్వరకీ తెలియదు. ఏ క్షణం ఏదైనా జరగొచ్చు. దేనికీ గ్యారెంటీ లేదు. అయితే ఓ గ్రామంలో మరణించిన వ్యక్తి శవయాత్రలో తేనెటీగలు దాడి చేయడంతో ఓ వృద్ధడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండల గర్శకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. మరణించిన బందువు మృతదేహాన్నిశ్మశాన వాటికకు శవయాత్రగా తీసుకెళ్తుండగా తేనెటీగలు మూకుమ్మడిగా దాడికి చేశాయి. దీంతో శవయాత్ర చేస్తున్న వారంతా తలోదిక్కుకూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే తేనెటీగలు విపరీతంగా […]

శవయాత్రలో తేనెటీగల దాడి.. ఒకరి మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 7:23 PM

మరణం ఎలా వెంటాడుతుందో ఎవ్వరకీ తెలియదు. ఏ క్షణం ఏదైనా జరగొచ్చు. దేనికీ గ్యారెంటీ లేదు. అయితే ఓ గ్రామంలో మరణించిన వ్యక్తి శవయాత్రలో తేనెటీగలు దాడి చేయడంతో ఓ వృద్ధడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండల గర్శకుర్తి గ్రామంలో చోటుచేసుకుంది.

మరణించిన బందువు మృతదేహాన్నిశ్మశాన వాటికకు శవయాత్రగా తీసుకెళ్తుండగా తేనెటీగలు మూకుమ్మడిగా దాడికి చేశాయి. దీంతో శవయాత్ర చేస్తున్న వారంతా తలోదిక్కుకూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే తేనెటీగలు విపరీతంగా కుట్టడంతో లచ్చయ్య అనే వృద్ధుడు మృతిచెందాడు. ఈ దాడిలో దాదాపు 35 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తేనెటీగలు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారికి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.