పడవ మునిగి 27 మంది మృతి, 9 మంది గల్లంతు

Honduran fishing boat sinks, పడవ మునిగి 27 మంది మృతి, 9 మంది గల్లంతు

సెంట్రల్ అమెరికా పరిధిలోని హోండూరస్ దేశంలో విషాదం చోటుచేసుకుంది. కరేబియన్ సముద్రంలో పడవ మునిగిన దుర్ఘటనలో 27 మంది మరణించారు. కరేబియన్ సముద్రంలో ఓ పడవలో 91 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో 27 మంది మరణించారని హోండూరస్ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి జోసీ డోమింగో మెజా చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది మత్స్యకారులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 55 మందిని కాపాడామని.. మరో తొమ్మిది మంది జాడ తెలియరాలేదని పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. లెంపిర ఓడరేవు నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *