సమ్మర్‌లో గ్యాస్, అసిడిటీ స‌మ‌స్య‌లా..? అయితే ఇలా చెక్ పెట్టండి..!

వేస‌విలో గ్యాస్, అసిడిటీ స‌మ‌స్య‌లు సహజంగానే వ‌స్తుంటాయి. ఎందుకంటే.. మ‌నం తీసుకున్న ఆహారం ఈ వేసవికాలంలో త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ‌డంతోపాటు, జీర్ణాశ‌యంలో మాటి మాటికీ గ్యాస్ ఉత్ప‌న్న‌మ‌వుతుంటుంది. దీంతో మ‌న‌కు ఇబ్బందులు వ‌స్తుంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాల‌ను పాటిస్తే ఈ గ్యాస్, అసిడిటీ సమస్యలను ఇట్టే అధిగమించొచ్చు. సాధారణంగా వేస‌విలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌ల్ల కూడా గ్యాస్ వ‌స్తుంటుంది. కాబట్టి నిత్యం త‌గిన మోతాదులో నీటిని తాగాలి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఉండే యాసిడ్ లెవ‌ల్స్ […]

సమ్మర్‌లో గ్యాస్, అసిడిటీ స‌మ‌స్య‌లా..? అయితే ఇలా చెక్ పెట్టండి..!
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 6:52 PM

వేస‌విలో గ్యాస్, అసిడిటీ స‌మ‌స్య‌లు సహజంగానే వ‌స్తుంటాయి. ఎందుకంటే.. మ‌నం తీసుకున్న ఆహారం ఈ వేసవికాలంలో త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ‌డంతోపాటు, జీర్ణాశ‌యంలో మాటి మాటికీ గ్యాస్ ఉత్ప‌న్న‌మ‌వుతుంటుంది. దీంతో మ‌న‌కు ఇబ్బందులు వ‌స్తుంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాల‌ను పాటిస్తే ఈ గ్యాస్, అసిడిటీ సమస్యలను ఇట్టే అధిగమించొచ్చు.

సాధారణంగా వేస‌విలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య వ‌ల్ల కూడా గ్యాస్ వ‌స్తుంటుంది. కాబట్టి నిత్యం త‌గిన మోతాదులో నీటిని తాగాలి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఉండే యాసిడ్ లెవ‌ల్స్ కంట్రోల్ అవ్వడంతో.. గ్యాస్ రాకుండా ఉంటుంది. అలాగే భోజ‌నం చేసిన త‌రువాత క‌నీసం 30 నిమిషాల పాటు కూర్చుని ఉండాలి. ఒకవేళ ప‌డుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

ఈ గ్యాస్ స‌మ‌స్య‌ను తొల‌గించ‌డంలో అల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. గ్యాస్ బాగా ఉంటే అల్లం టీ తాగడం కానీ.. లేదా చిన్న అల్లం ముక్క‌ను అలాగే న‌మిలి మింగాలి. దీంతో గ్యాస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక పుదీనా ర‌సం, నిమ్మ‌రసం, బేకింగ్ సోడా నీటి మిశ్ర‌మంల‌లో దేన్ని తాగినా గ్యాస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కుల‌లో దేన్ని.. తిన్నా కూడా గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.