సుశాంత్‌ కేసును తేల్చేందుకు ముంబయి పోలీసులు చాలు: మంత్రి

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

సుశాంత్‌ కేసును తేల్చేందుకు ముంబయి పోలీసులు చాలు: మంత్రి
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2020 | 11:17 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారి డిమాండ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మద్దతు తెలుపుతున్నారు. ఇక నిన్నటికి నిన్న సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా నటుడి మృతిపై స్పందిస్తూ.. తన బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తనకు తెలియాలని, అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించండి అంటూ హోం మంత్రి అమిత్‌ షాకు ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మృతిపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్‌ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులు ఛేదించగలరని, ఇలాంటి కేసులను వారు ఎన్నో పరిష్కరించారని, అలాంటప్పుడు సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని అనిల్‌ దేశ్‌ముఖ్ అన్నారు. ముంబయి పోలీసులు ప్రతి కోణంలోనూ సుశాంత్‌ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి కుట్ర కనిపించలేదని, దర్యాప్తు పూర్తి తరువాత అన్ని వివరాలు బయటకు వస్తాయని అనిల్‌ వెల్లడించారు. కాగా గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొని సుశాంత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.