మౌని అమావాస్య నేపథ్యంలో.. వారణాసికి పోటెత్తిన భక్తులు!

మౌని అమావాస్య సందర్భంగా వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ‘పుష్యమాస అమావాస్య’ ను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఎంతో మంచిరోజు అని హిందువులు భావిస్తారు. ఆ రోజున తమ పితృ దేవతలకు తర్పణాలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. ‘పుష్యమాస అమావాస్య’ నాడు మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. అందుకే ఈ అమావాస్యను ‘మౌని అమావాస్య’ అని కూడా పిలుస్తారు. ‘మౌని అమవాస్య’ […]

మౌని అమావాస్య నేపథ్యంలో.. వారణాసికి పోటెత్తిన భక్తులు!
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 5:52 PM

మౌని అమావాస్య సందర్భంగా వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ‘పుష్యమాస అమావాస్య’ ను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఎంతో మంచిరోజు అని హిందువులు భావిస్తారు. ఆ రోజున తమ పితృ దేవతలకు తర్పణాలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. ‘పుష్యమాస అమావాస్య’ నాడు మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తారు. అందుకే ఈ అమావాస్యను ‘మౌని అమావాస్య’ అని కూడా పిలుస్తారు.

‘మౌని అమవాస్య’ క్రమంలో వారణాసిలోని పవిత్ర గంగానదికి భక్తులు వేల సంఖ్యలో చేరుకున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేసి, ఆచార సంప్రదాయల ప్రకారం పూజాదికాలు నిర్వహిస్తున్నారు. మౌని అమావాస్య రోజు సాదువులు, యోగులు మౌనంగా ఉంటారు. జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి మాటలు అవసరం లేదని యోగుల భావిస్తారు.