కరోనా బారిన పడ్డ హాలీవుడ్ నటి ఒలివియా..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 9లక్షలు దాటేయగా.. మృతుల సంఖ్య 47వేలపైకి చేరింది.

కరోనా బారిన పడ్డ హాలీవుడ్ నటి ఒలివియా..!
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 4:15 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 9లక్షలు దాటేయగా.. మృతుల సంఖ్య 47వేలపైకి చేరింది. సెలబ్రిటీల్లోనూ చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు హాలీవుడ్ నటి ఒలివియా నిక్కనేన్‌ సోషల్ మీడియాలో ప్రకటించారు. ద సొసైటీ, సూపర్‌గర్ల్‌ వంటి సిరీస్‌లో నటించిన ఒలివియాకు ఇటీవల కరోనా సోకగా.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఇంకా తనకు నీరసం తగ్గలేదని ఆమె తెలిపారు.

తాను, తన తల్లి రెండు వారాలకు పైనే ఐసోలేషన్‌లో ఉన్నామని.. ఇప్పుడు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బావుందని ఒలివియా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు వచ్చిన లక్షణాలను కూడా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. మార్చి 13న తనకు 99.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో పాటు శరీర నొప్పులు వచ్చాయని.. 14న 102.4 డిగ్రీల జ్వరం రావడంతో పాటు జలుబు, అలసట ఎక్కువ అయ్యాయని ఆమె వివరించారు. ఆ మరుసటి రోజు రుచి చూసే సామర్థ్యం కోల్పోయానని.. 16న గొంతు నొప్పి రాగా.. మరుసటి రోజు తగ్గిపోయిందని తెలిపారు. ఇక ఆ రోజే తాను తన నమూనాలను టెస్ట్ నిమిత్తం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక మార్చి 19న తనకు చెస్ట్‌ పట్టేసినట్లు అయ్యిందని.. ఫీవర్ క్రమేపీ తగ్గుతూ వచ్చిందని ఒలివియా తెలిపారు. ఇక తాను రెస్ట్ తీసుకున్న సమయంలో ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకున్నానని.. ఫీవర్, చెస్ట్ నొప్పి వచ్చినప్పుడు టైలెనోల్‌ వాడానని ఆమె అన్నారు. ఇంట్లోనే ఉండి కోలుకున్నందుకు తాను అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు.

Read This Story Also: హలో.. హలో.. కాస్త ఆగండి..! క్లారిటీ ఇచ్చిన పూజా..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!