హెచ్ఎండీఏ అడ్రస్ మారింది..!

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని అధికారులు షిప్టు చేశారు. గత కొంతకాలంగా తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెచ్ఎండీఏ ఆఫీసును అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో మార్చేశారు అధికారులు.

హెచ్ఎండీఏ అడ్రస్ మారింది..!
Follow us

|

Updated on: Aug 04, 2020 | 12:45 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయాన్ని అధికారులు షిప్టు చేశారు. గత కొంతకాలంగా తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న హెచ్ఎండీఏ ఆఫీసును అమీర్‌పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో మార్చేశారు అధికారులు. ఇక నుంచి స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని రెండు, నాలుగు, ఐదు, ఏడో అంతస్థుల్లో హెచ్ఎండీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

హెచ్ఎండీఏ వెబ్‌సైట్, మెయిల్ ఐడీ, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో ఎలాంటి మార్పులు ఉండవని… అథారిటీ ఆఫీసు అడ్రస్ మైత్రివనం పక్కనున్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌కు మారిన విషయాన్ని ప్రజలు గమనించాలని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తార్నాకలో కొనసాగుతున్న కార్యాలయం హైదబాదీలకు దూరంగా ఉందని, రాకపోకలకు అసౌకర్యంగా ఉందని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక వివిధ విభాగాల మధ్య సమన్వయం కుదరడం లేదని.. ఇటు, స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో చాలా భాగం ఖాళీగా ఉండటంతో హెచ్ఎండీఏ హెడ్ ఆఫీసును అమీర్‌పేటకు తరలించాల్సి వచ్చినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇక, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ కార్యాలయ ఆధునికీకరణకు రూ.8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

1975లో ఏర్పాటైన హెచ్ఎండీఏ నాటి నుంచి 2008 వరకు బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో కార్యకలాపాలు కొనసాగాయి. 2008లో పైగా ప్యాలెస్‌ను అమెరికా కన్సులేట్‌కు అప్పగించారు. దీంతో మారేడ్‌పల్లిలోని మున్సిపల్ ఆఫీసు భవనంలోకి హెచ్ఎండీఏను మార్చారు. ఆ తర్వాత 2010 నుంచి ఇప్పటి వరకు తార్నాకలోని డిస్ట్రిక్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మహానగరవాసులకు సొంతింటి వాళ్లను చేస్తున్న హెచ్ఎండీఏకే పక్కా భవనం లేకపోవడంపట్ల భాగ్యనగరవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.