Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా వ్యవహరించనున్న ప్రభుత్వం. రైతులకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌ దగ్గర ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన... ట్రూనాట్‌ ల్యాబుల్లో టెక్నీషియన్లకు శెలవులు ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ ఆరోపణ... వెంటనే శెలవులు ఇవ్వాలని డిమాండ్‌... ఒంగోలులో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు పాజిటివ్‌, మార్కాపురంలో మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మృతి చెందడంతో ఆందోళనలో ల్యాబ్‌ టెక్నీషియన్లు.
  • అమరావతి : ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ . ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికో ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ .
  • గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్దిని అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు. వీడియోలు చూసిన వారిని లింక్ లు ఓపెన్ చేసిన వారిని కూడ గుర్తించిన పోలీసులు. మరో ఇద్దరు పోలీసులు అదుపులో. ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం.

జమ్మూలో యోగీ స్టైల్.. “సిటీ చౌక్” ఇక నుంచి ‘..భారత్ మాతా చౌక్’.. ఇంకా!

యూపీలో యోగీ పేరు చెబితే చాలు.. నగరాల పేర్లు మార్చడంలో దిట్టా అని అందరికీ తెలిసిందే. గతంలో అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్‌గా.. మార్చారు. ఇక ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఇలా పేర్లను మార్పు చేసేందుకు రంగం సిద్ధమైంది.
Historic city square in Jammu renamed as 'Bharat Mata Chowk', జమ్మూలో యోగీ స్టైల్.. “సిటీ చౌక్” ఇక నుంచి ‘..భారత్ మాతా చౌక్’.. ఇంకా!

యూపీలో యోగీ పేరు చెబితే చాలు.. నగరాల పేర్లు మార్చడంలో దిట్టా అని అందరికీ తెలిసిందే. గతంలో అలహాబాద్ పేరును ప్రయాగ రాజ్‌గా.. ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య జిల్లాగా పేర్లు మార్చారు. అంతేకాదు.. మొగల్ సరాయి రైల్వే స్టేషన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌గా మార్చారు. ఇవన్నీ యూపీలో మారిన నగరాల పేర్లు. ఇక ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఇలా పేర్లను మార్పు చేసేందుకు రంగం సిద్ధమైంది.

తాజాగా.. గతేడాది ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ఓల్డ్ జమ్ము కమర్షియల్ హబ్‌లో ఉన్న చారిత్రాత్మక ‘సిటీ చౌక్’ పేరును మార్చారు. ఇక నుంచి ఈ చౌక్‌ను ‘భారత్ మాతా చౌక్’గా పిలవనున్నారు. అంతేకాదు.. ఆ ప్రాంతంలో సిటీ చౌక్ అని ఉన్న బోర్డుల స్థానంలో భారత్ మాతా చౌక్ పేర్లతో బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి.

ఈ విషయాన్ని స్థానికంగా బీజేపీ అధికారంలో ఉన్న జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ (జేఎంసీ) అధికారులు అధికారికంగా వెల్లడించారు. అయితే సిటీ చౌక్ పేరు మార్పుపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వెలువడుతోంది. మెజార్టీ ప్రజలు పేరు మార్పును స్వాగతిస్తోంటే.. మరికొందరు మాత్రం పేరు మార్పు కంటే ముఖ్యంగా నగరంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు.

అంతేకాదు… ఇలా మరిన్ని ప్రాంతాల పేర్లను కూడా రాబోయే రోజుల్లో మార్చనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జమ్ములోని పంజ్ తీర్థి వద్ద ఉన్న సర్క్యులర్ రోడ్డుకు.. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పే‌య్‌ పేరును పెట్టారు. సర్క్యులర్ రోడ్డుకు.. ‘అటల్ చౌక్’గా నామకరణం చేశారు.

Related Tags