‘హిప్పీ’ రివ్యూ..!

మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా విజయంతో.. ఒక్కసారిగా అవకాశాలన్నీ కార్తికేయని వరించాయి. దీంతో.. ఆ తర్వాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే.. ఈ నేపథ్యంలో ‘హిప్పీ’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు కార్తికేయ. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించగా, తమిళ నిర్మాత కలైపులి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే విడుదలైన పోస్టర్, టీజర్స్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచానాలు […]

'హిప్పీ' రివ్యూ..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 3:14 PM

మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా విజయంతో.. ఒక్కసారిగా అవకాశాలన్నీ కార్తికేయని వరించాయి. దీంతో.. ఆ తర్వాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. అయితే.. ఈ నేపథ్యంలో ‘హిప్పీ’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు కార్తికేయ. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించగా, తమిళ నిర్మాత కలైపులి నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవలే విడుదలైన పోస్టర్, టీజర్స్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచానాలు పెంచేశాయి. కాగా.. అందులోనూ చాలా రోజుల తర్వాత జేడీ చక్రవర్తి ఈ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వడం దీనికి ప్లస్ పాయింట్ అయ్యింది. కార్తికేయ జోరు ఎలా పెరిగిందో చూడాలంటే కథలోకి వెళ్లాల్సిందే..!

కథ :

ఎప్పుడు ఏదనిపిస్తే అది చేస్తూ, ఫ్రెండ్స్‌తో జాలీగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ హిప్పీ దేవదాస్ (కార్తికేయ). ఇతను ఓ వైపు బాక్సింగ్ చేస్తూనే, మరో వైపు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తూంటాడు. గోవాలో ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవంశీ)ని చూడగానే ప్రేమలో పడతాడు. కానీ.. ఇంతకు ముందే స్నేహ (జబ్బాసింగ్), హిప్పీ ప్రేమలో ఉంటారు. అయినా కార్తికేయ ఆముక్తనే ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను ప్రేమకు ఒప్పిస్తాడు. అక్కడి నుంచే అసలైన కథ మొదలవుతుంది. హిప్పీ ప్రేమకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆముక్త విచిత్రమైన కండీషన్స్‌ పెడుతూ ఉంటుంది. దీంతో.. తన స్వేచ్ఛను కోల్పోయినట్లు ఫీలవుతాడు హిప్పీ. అయితే.. ఆ తరువాత ఏమయింది..? ఆముక్త, హిప్పీల లవ్ పెళ్లి వరకూ వెళ్లిందా..? జేడీ చక్రవర్తి పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

కార్తికేయ ఈ సినిమాలో హుషారుగా కనిపించాడు. ఆర్ ఎక్స్ 100లో ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించిన కార్తికేయకు ఈ సినిమా పాత్రలో వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. లుక్స్‌తో పాటు నటనపరంగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టాడు. హీరోయిన్స్ ఇద్దరూ వారి పాత్రలలో ఒదిగిపోయారు. దిగంగన అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సెకండాఫ్‌లో కూడా ఇద్దరూ బాగా నటించారు. ఇక చాలా రోజుల తర్వాత కనిపించిన జేడీ చక్రవర్తి క్యారెక్టర్ కూడా ప్రేక్షకులకు దగ్గరగా నిలుస్తుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ జేడీ అందర్నీ కడుబుబ్బా నవ్వించారనే చెప్పాలి.

ఎలా ఉంది..?

ఇక డైరెక్టర్ టీఎన్ కృష్ణ తాను రాసుకున్న కథను చక్కగా చూపించారు. చిన్న కథను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెలిపారు. కథ పరంగా బాగానే ఉన్నా కానీ కథనం మాత్రం సాగదీతగా అనిపించింది. సెకండాఫ్‌లో కథ ఎటూ తేలక అక్కడక్కడే తిరిగిందనిపిస్తుంది. జేడీ తెలంగాణ యాస కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అయితే… రొమాంటిక్ సీన్స్ విషయంలో కాస్త లిమిట్స్ క్రాస్ చేసినట్టుంది.

కాగా.. మొత్తానికి యూత్‌కి ఈ సినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.