Breaking News
  • తూర్పుగోదావరి: రైతు సదస్సులో జనసేన కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీకు క్రమశిక్షణ లేదంటూ కార్యకర్తలపై పవన్ ఆగ్రహం. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోయానన్న పవన్
  • ఢిల్లీ అగ్నిప్రమాదంపై క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు. ఫ్యాక్టరీ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. పరారీలో ఫ్యాక్టరీ యజమాని. వారం రోజుల్లో విచరాణ పూర్తి చేయాలని ఆదేశాలు
  • అమరావతి: ఈ నెల 23 నుంచి కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన. మూడు రోజులపాటు పర్యటించనున్న వైఎస్‌ జగన్‌. జమ్మలమడుగు, పులివెందుల, కడప, మైదుకూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్‌
  • అనంతపురం: సాకే పవన్‌ చేసిన వ్యాఖ్యలకు జనసేన మద్దతు. సాకే వ్యాఖ్యలను సమర్థించిన అనంతపురం జనసేన నేతలు. రెడ్డి సంఘం నేతలపై జనసేన నేతల ఆగ్రహం
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • మాజీ ఎంపీ కవితకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం. ఐఎస్‌బీలో ఇండియన్‌ డెమక్రసీ ఎట్‌ వర్క్‌ సదస్సుకు ఆహ్వానం. జనవరి 9, 10 తేదీలలో జరగనున్న సదస్సు. మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌ అంశంపై ప్రసంగించనున్న కవిత
  • తూ.గో:జనసేన రైతు సదస్సును ముట్టడించిన ఎమ్మార్పీఎస్‌. పవన్‌ రైతు సదస్సులోకి చొచ్చుకొచ్చిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు. అడ్డుకున్న జన సైనికులు, ఇరువురి మధ్య తోపులాట. సమస్యలపై పవన్‌తో మాట్లాడాలంటూ వాగ్వాదం

బాలయ్యా తమరెక్కడయ్యా ? హిందూపూర్‌లో ఏం జరుగుతుందంటే ?

people searching for balakrishna, బాలయ్యా తమరెక్కడయ్యా ? హిందూపూర్‌లో ఏం జరుగుతుందంటే ?

రూలర్ మూవీలో సూపర్ లుక్‌తో తన ఫ్యాన్స్‌ని అలరించేందుకు సిద్దమవుతున్న హీరో కమ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నియోజకవర్గం ప్రజలు చుక్కలు చూపెడుతున్నారట. బాలయ్య తమరెక్కడయ్యా…? హిందూపురం నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారట ! అసలు తమ ఎమ్మెల్యే ఆచూకీ లేదంటూ గగ్గోలు పెడుతున్నారట. వైసీపీ గాలీ బలంగా వీచిన సమయంలోనూ బాలయ్యకు పట్టం కడితే కనీసం అటువైపే చూడడం లేదు. షూటింగ్‌లు తప్పా నియోజకవర్గ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని హిందూపూర్ జనం వాపోతున్నారని సమాచారం.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నలుమూలలా ఫ్యాన్‌ గాలి వీచింది. కానీ అనంతపురం జిల్లా హిందూపురంలో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. కారణం అక్కడ పోటీ చేసింది బాలయ్య. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంతా కలిసి జై బాలయ్య అని నినదించారు. నిజానికి టీడీపీ ఆవిర్భావం నుంచి ఎత్తిన జెండా దించకుండా మోస్తున్నది హిందూపురం ప్రజలే !

ఆనాడు ఎన్టీఆర్‌ను రెండుసార్లు గెలిపించారు. అలాగే హరికృష్ణకు ఓసారి బాలయ్యకు రెండుసార్లు పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్‌ గాలి వీచినా… హిందూపురం ప్రజలు మాత్రం బాలయ్యకే జైకొట్టారు. రాయలసీమలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు గెలిస్తే అందులో ఒకరు బాలకృష్ణ.

అయినా 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొంత నిరుత్సాహ పడ్డారు. ఇదే సందర్భంలో బాలయ్య గెలుపుతో ఆనందపడ్డారు. అయితే అప్పుడెప్పుడో ఎన్నికల ప్రచారంలో కన్పించిన బాలకృష్ణ మళ్లీ నియోజకవర్గం వైపు చూడలేదన్నది అక్కడి జనం తాజా ఆరోపణ. ఇప్పటికీ బాలయ్య తను నటుడిగానే భావిస్తున్నారు తప్ప… హిందూపురం ఎమ్మెల్యేనన్న విషయం మర్చిపోయారని విమర్శిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా… నియోజకవర్గంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

people searching for balakrishna, బాలయ్యా తమరెక్కడయ్యా ? హిందూపూర్‌లో ఏం జరుగుతుందంటే ?

బాలకృష్ణ 2014లో హిందూపురం నుంచి గెలిచిన తర్వాత ఐదేళ్లలో మూడు… నాలుగు సినిమాలు తీసుకున్నారు. త‌ప్పితే.. ఇక్కడి ప్రజ‌ల సంక్షేమాన్ని కానీ, వారి బాగోగులు కానీ ప‌ట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా కూడా మ‌రోసారి గెలిస్తే.. నేను నియోజ‌క‌వ‌ర్గంలోనే అందుబాటులోనే ఉంటానంటూ ఆధార్‌ కార్డుతో పాటు ఎన్నికల కార్డు అడ్రస్‌లు హిందూపురానికి మార్పించుకున్నారు. దీంతో అక్కడి జనం మన బాలయ్యే కదాని మరోసారి ఛాన్సిచ్చారు. అయితే మళ్లీ బాలయ్య హిందూపురం మొఖం చూడడమే మానేశారు. దీంతో హిందూపురంలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి.

తాజాగా నియోజకవర్గానికి వచ్చిన బాలయ్యను అక్కడి జనం నిలదీశారు. లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు బాలకృష్ణను అడ్డుకుని రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి వస్తున్న బాలయ్య మార్గమధ్యంలోనే ఆపేశారు. లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డుకు భూమిపూజ చేసి ఏడాది కావస్తున్నా…ఒక్క పని కూడా మొదలు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహంగా ఉన్న జనం ఎమ్మెల్యేని గట్టిగానే నిలదీశారు.

సాధారణంగా ఎవరైనా ప్రశ్నిస్తే ఆగ్రహంతో ఊగిపోయే బాలయ్యా… ఆ సమయంలో మాత్రం ఓపిక‌గా వారి ఆవేద‌న‌ను ఆల‌కించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ప్రజలు శాంతించారు. ఏదేమైనా బాలయ్య అటు సినిమాలతో పాటు ఇటు తనను గెలిపించిన నియోజకవర్గ సమస్యలపైనా దృష్టి పెడితే బాగుంటుంది !