భారత్-పాక్.. అందాల ప్రేమపక్షులు

India-Pakistan Girls Love Story Breaks Internet, భారత్-పాక్.. అందాల ప్రేమపక్షులు

న్యూయార్క్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు అందమైన అమ్మాయిలు తీసుకున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు చూసిన కొంతమంది ఆ అమ్మాయిల అందానికి ఫిదా కాగా.. మరికొందరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఈ ఇద్దరు యువతులు రీసెంట్‌గా అమెరికాలో ఫోటో‌షూట్ చేశారు. ఇక ఆ ఇద్దరి నడుమ ఓ అద్భుతమైన లవ్ స్టోరీ కూడా ఉందట. ఆ యువతులు ఎవరంటే.. ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం ఆర్టిస్ట్‌ సుందాస్ మాలిక్‌ కాగా.. మరొకరు భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా.

న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిరు జల్లులు పడుతుండగా పారదర్శక గొడుగులో ఈ ఇద్దరూ నవ్వుతూ, తుళ్లుతూ.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఫ్రెంచ్ కిస్ ఇస్తున్నట్లుగా ఈ ఫొటోలు తీశారు. ‘ఏ న్యూయార్క్‌ లవ్‌ స్టోరీ’ పేరుతో ఫొటోగ్రాఫర్‌ సరోవర్‌ తన ట్విటర్‌లో ఈ ఫోటోలు పోస్ట్ చేయగా.. నెటిజన్లను అవి విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *