పాక్ లో హిందూ మెడికల్ స్టూడెంట్ హత్య ?

hindu medical student found dead under mysterious conditions in pakistan, పాక్ లో హిందూ మెడికల్ స్టూడెంట్ హత్య ?

పాకిస్తాన్ లోని లర్కానా లో నమ్రితా చందానీ అనే మెడికల్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అక్కడి ఓ డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన ఈమె తన హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించింది. ఆమె మెడ చుట్టూ ఓ తాడు బిగించి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈమె సూసైడ్ చేసుకుందా లేక మర్డరా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. నమ్రిత మైనారిటీ అయిన కారణంగానే ఆమెను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా-తన సోదరి దూపట్టా ధరించి ఉండగా.. దాని స్థానే కేబుల్ వైర్ కనిపించిందని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఈమె సోదరుడు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందూ ఆలయాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ డెంటల్ విద్యార్థిని మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసినప్పటినుంచి పాకిస్థాన్ లో భారత వ్యతిరేక పోకడలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలి కాలంలో ముఖ్యంగా హిందువులను సంఘవ్యతిరేక శక్తులు టార్గెట్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *