‘ఛాయిస్’ నీకే వదిలేస్తున్నా.. రామాయణమా.. లేక మహాభారతమా..!

Hindi Prasthanam Movie Teaser Unveiled, ‘ఛాయిస్’ నీకే వదిలేస్తున్నా.. రామాయణమా.. లేక మహాభారతమా..!

శర్వానంద్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. మాతృకకు ఏమాత్రం పోలిక లేకుండా.. ఆసక్తికరమైన అంశాలతో టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సంజయ్ దత్ చివరిలో చెప్పిన ‘ఛాయిస్’ నీకే వదిలేస్తున్నా.. రామాయణమా.. లేక మహాభారతమా అనే డైలాగ్‌ను హైలైట్ చేశారు.

దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మనీషా కొయిరాలా, అలీ ఫైజల్, జాకీ షరీఫ్, అమైరా దస్తూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *