Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

ఒకే దేశం- ఒకే భాష సాధ్యమేనా..హిందీ భాషపై బీజేపీ వ్యూహం ఏంటీ?

Hindi Diwas: What is BJP plan, ఒకే దేశం- ఒకే భాష సాధ్యమేనా..హిందీ భాషపై బీజేపీ వ్యూహం ఏంటీ?

“ఒకే దేశం ఒకే భాష” కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్‌షా చేసిన తాజా వ్యాఖ్య ఇది. ఆయన వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందా అని రాజకీయ పార్టీలతో పాటు మాతృభాషలో మాట్లాడే వారికీ కూడా సందేహాం కలుగుతుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుతున్నారు. దేశ అధికార భాషగా హిందీని రాజ్యాంగంలో చేర్చిన రోజును గుర్తు చేసుకుంటు దీన్ని ఈ రోజును హిందీ దివస్‌గా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేలా అత్యధికులు మాట్లాడే భాషగా హిందీ ఉండాలంటూ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కలలను సాకారం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే దేశంలో ఒకే దేశం ఒకే రాజ్యాంగం, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఇకే దేశం ఒకే పన్ను విధానం అంటూ సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన బీజేపీ..తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని పిలుపు ఇచ్చినట్టయ్యింది. దేశమంతా ఒకే భాషతో భారత్ ఏకమవుతుందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈ విధంగా దేశమంతా ఒకే భాష ఉంటే ప్రపంచ దేశాల్లో మనం ఒక్కటనే భావన కలిగించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మన దేశం విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులతో పాటు ఎన్నో భాషలకు పెట్టింది పేరు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ప్రజలు మాట్లాడుకునే మాతృభాష ఒకటి ఉంటుంది. అయితే “ఒకే దేశం ఒకే భాష” అనే నినాదాన్ని కేంద్రం నిర్ణయంగా మార్చుకుంటే ఆయా ప్రాంతీయ భాషలకు ఇప్పుడున్న విలువ ఖచ్చితంగా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రాచీన భాషగా తెలుగును గుర్తించడానికి ఎన్నో ఏళ్ల సమయం పట్టింది. దీనికోసం ఎన్నో ఉద్యమాలు చేస్తే తప్ప గత ప్రభుత్వాలు ప్రాచీన హోదా ఇవ్వలేదు. దేశంలో కేవలం హిందీ భాషతో పాటే అనేక భాషలు ఎంతో ప్రాచీనంగా ఉన్నయనే విషయం నిర్వివాదాంశం. దక్షిణాధి భాషలు ఎంతో ప్రాచీనంగా ఉన్నాయి.
హిందీ భాషనుంచి పుట్టుకొచ్చిన భాషలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హిందీ, మరాఠీ భాషల లిపి ఒక్కటే. కానీ పలికే విధానం వేరుగా ఉంటుంది. ఇదొక్కడే కాదు హిందీ భాషను ఆధారంగా చేసుకునో లేక హిందీ భాషకు దగ్గరగానో ఎన్నో ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని ప్రామాణికంగ చేసుకుని ఒకే దేశం ఒకే భాష అనే నినాదం బలంగా తీసుకువెళితే దక్షిణాది భాషలకు కష్టాలు తప్పవంటున్నారు భాషా ప్రేమికులు. హిందీ రాజభాషగా గుర్తింపు పొందినా.. ప్రాంతీయ భాషలకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్‌షా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు అంత ఈజీగా కొట్టిపారేయడానికి లేదు. భారత్‌ను ప్రపంచ దేశాల ముందు పరిచయం చేసేసమయంలో ఒకే దేశం ఒకే భాష అంటూ హిందీకి ప్రాధాన్యత ఇస్తే మరి మిగిలిన ప్రాంతీయ భాషల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇదిలా ఉంటే అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదని.. వాటి కంటే ఎంతో భారత్‌ ఎంతో విశాలమైందని పేర్కొన్నారు. భారతీయులందరి భాష కేవలం హిందీ మాత్రమే కాదని, ఇక్కడ ఎన్నో సంస్కృతులు, ఎన్నో మాతృభాషలు ఉన్నాయని, ముందు వాటి అందాన్ని, భిన్నత్వాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి అంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 29 తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతి సంప్రదాయాలు పాటించేందుకు స్వేచ్ఛను కల్పిచిందని, హిందూ, హిందూ, హిందుత్వ కంటే భారత్ ఎంతో పెద్దది అంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు.

మరోవైపు హిందీపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేసే తమిళనాడు నేతలు కూడా అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు భారత సమగ్రత, ఐక్యతకు ప్రమాదాన్ని తెస్తాయంటూ డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. కేంద్ర మంత్రి హిందీ భాషకోసం చేసిన కామెంట్ చూసి షాక్ అయినట్టుగా స్టాలిన్ తెలిపారు. సోమవారం తమ పార్టీ అత్యవసరంగా సమావేశమై అమిత్‌షా వ్యాఖ్యలపై చర్చిస్తామని తెలిపారు. అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా తమిళ నేత వైగో కూడా అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను దేశమంతా బలవంతంగా రుద్దాలనుకోవడం ముర్ఖత్వమంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే జరిగితే హిందీ వద్దనుకునే రాష్ట్రాలు భారత్‌లో ఉండే పరిస్థితి లేదని కూడా వైగో హెచ్చరించారు.

ఒకే దేశం ఒకే భాష అనే నినాదం ఏ మలుపులకు దారితీస్తుందో తెలియదు గానీ ప్రాంతీయ భాషల ఉనికికి మాత్రం గొడ్డలిపెట్టుగా మారే పరిస్థితి మాత్రం ఉందంటున్నారు భాషా ప్రేమికులు. ఒకే దేశం ఒకే రాజ్యాంగ అనడంలో తప్పులేదు. ఒకే దేశం ఒకే పన్ను నిర్ణయం తప్పులేదు, కానీ ఒకే దేశం ఒకే భాష అంటే మాత్రం ఆలోచించవలసిందే. ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వంతో కలిగిన దేశం. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ భాషలు మాతృ భాషలుగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తే గతంలో జరిగినట్టే మాతృభాష అస్థిత్వాన్ని కాపాడుకోడానికి ఉద్యమాలు జరగడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.