టూరిజంపై కరోనా దెబ్బ.. రాష్ట్రానికి రూ.4,000 నష్టం: జైరాం ఠాకూర్

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. అన్నిరంగాలపై కొవిడ్ ప్రభావం పడింది

టూరిజంపై కరోనా దెబ్బ.. రాష్ట్రానికి రూ.4,000 నష్టం: జైరాం ఠాకూర్
Follow us

|

Updated on: Sep 17, 2020 | 8:14 PM

కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కుదిపేసింది. ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. అన్నిరంగాలపై కొవిడ్ ప్రభావం పడింది. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా ఆగంపట్టించింది మాయదారి వైరస్.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం మొత్తం ఆగిపోయింది. పర్యాటకంపై ఎక్కువ ఆదాయం ఆర్జించే దేశాలు, రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ పడింది. మన దేశంలో పర్యాటకంపై ఆధారపడ్డ రాష్ట్రాలు ఆర్థికంగా కృంగిపోయాయి. అధిక మొత్తాన్ని ఆర్జిస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సైతం కోవిడ్-19 సంక్షోభానికి ఆర్థికంగా చితికిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తెలిపారు. కోవిడ్-19 వల్ల సుమారు 4,000 కోట్ల రూపాయల మేర రాష్ట్రం ఆదాయానికి గండిపడింది ఆయన తెలిపారు.

కొవిడ్ నిబంధనల్లో భాగంగా లాక్ డౌన్ విధింపుతో రాష్ట్రంలో టూరిజం పూర్తిగా నిలిచిపోయింది. నిలిచిపోయిన ఆదాయాన్ని పెంచుకోవల్సిన అవసముందన్నారు సీఎం. పర్యాటకాన్ని మళ్లీ పునరుజ్జీవనం చేయడానికి, అలాగే బాధిత ప్రజలకు ఉపశమనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతోందని జైరాం ఠాకూర్ అన్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.